ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను జాతీయ స్థాయిలో జైవిక్ ఇండియా అవార్డు లభించింది. ఏపీ ప్రభుత్వానికి జైవిక్ ఇండియా అవార్డును ఇంటర్నేషనల్ కాంపిటేన్స్ సెంటర్ ఫర్ ఆర్గానికి అగ్రికల్చర్ సంస్థ ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వానికి ఈ అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను ప్రకటించగా.. ఇందులో ఏపీకి 3 అవార్డులు దక్కడ విశేషం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలానే సేంద్రియ, ప్రకృతి సేద్య వ్యవసాయాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అలానే వ్యవసాయరంగలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ ఫలితమే ఏపీకి అవార్డులు రావడానికి ప్రధాన కారణమైంది. ఇప్పటికే ఏపీకి జాతీయ స్థాయిలో పలు అవార్డులు రాగా.. మరోసారి ప్రతిష్టాత్మక జైవిక్ అవార్డును కూడ సొంతం చేసుకుంది.
పల్నాడు జిల్లాకు చెందిన ఆర్గానికి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, బాపట్ల జిల్లాకు చెందిన గనిమిశెట్టి పద్మజ జైవిక్ ఇండియా అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి సెప్టెంబర్ 7న ఢిల్లీలో జరిగే ‘బయోఫాక్ ఇండియా నేచురల్స్ ఎక్స్ పో’ ప్రదానం చేయనున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం కేటగిరిలో అత్తలూరు పాలెం ఆర్గానికి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ కు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. ఈ కంపెనీ పరిధిలో 400 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల పరిధిలోని ఇతర రైతులకు అవసరమయ్యే జీవ ఎరువులను అందజేస్తున్నారు.
ఇలానే ఉత్తమ ప్రకృతి వ్యవసాయ మహిళ కేటగిరిలో బాపట్ల జిల్లాకు చెందిన గనిమిశెట్టి పద్మజ కు జైవిక్ అవార్డుకు ఎంపికైంది. ఆమె గత నాలుగేళ్లుగా సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తోంది. ఆమె తనకు ఉన్న ఎకరం పొలం ద్వారా రూ.1.5 లక్షల ఆదాయం అర్జీస్తోంది. అలానేఅలానే పశువుల పెంపకం ద్వారా రూ.60 వేలు, కషాయాల విక్రయాల ద్వారా మరో రూ.5 వేలు సంపాదిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాల కోటాలో ఏపీ ఉత్తమ ప్రభుత్వంగా నిలిచి జైవిక్ ఇండియా అవార్డుకు ఎంపికైంది. మరి.. ఇలా ఏపీ ప్రభుత్వం ఒక్కేసారి మూడు అవార్డులు అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: AP గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త! త్వరలోనే..