iDreamPost

AP గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త! త్వరలోనే..

  • Author Soma Sekhar Published - 09:03 AM, Sat - 26 August 23
  • Author Soma Sekhar Published - 09:03 AM, Sat - 26 August 23
AP గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త! త్వరలోనే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ.. సబ్బండ వర్గాల ఉన్నతికి తోడ్పడుతోంది. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ఇప్పటికే వీఆర్వో, వీఆర్ఏలకు సంబంధించిన సమస్యలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్.. తాజాగా ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. అలాగే 17 కేటగిరిలోని ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పక్షపాతిగా ఇప్పటికే పలు సానుకూల నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. మరో ముందడుగు వేసింది. ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. కాగా.. ఇప్పటికే విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ లకు పదోన్నతలు దక్కిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో పలు శాఖల ఆధ్వర్యంలో మెుత్తం 19 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తుండగా.. వారిలో 17 రకాల కేటగిరి ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ప్రక్రియ, విధివిధానాలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.

కాగా.. నాలుగేళ్ల క్రితం సచివాలయాల్లో గ్రామ ఉద్యాన అసిస్టెంట్ గా నియామకం అయిన వారిలో కొందరికి ప్రమోషన్లు దక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేటగిరి-1 ఉద్యానవన ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 53 ఖాళీ ఉండగా.. ఈ పోస్టులకు నెల రోజుల క్రితమే భర్తీ ప్రక్రియ మెుదలైంది. కాగా.. ఈ 17 కేటగిరి గ్రామ, వార్డు ఉద్యోగాలకు సంబంధించి ప్రమోషన్లు ప్రకటించగానే.. ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు అవకాశం దక్కుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ ఎడ్యూకేషన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ప్రమోషన్ల ప్రక్రియకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. మరి జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ట్రైబల్ యూనివర్సిటీ గిరిపుత్రల జీవితాలను మారుస్తుంది: సీఎం జగన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి