iDreamPost
android-app
ios-app

వాలంటీర్లకు శుభవార్త చెప్పిన CM జగన్! జీతాలపై కీలక నిర్ణయం..

  • Author Soma Sekhar Updated - 12:19 PM, Thu - 20 July 23
  • Author Soma Sekhar Updated - 12:19 PM, Thu - 20 July 23
వాలంటీర్లకు శుభవార్త చెప్పిన CM జగన్! జీతాలపై కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లది కీలక పాత్ర. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వాలంటీర్ల వ్యవస్థే కీలకం. వీరికి గౌరవ వేతనం కింద రూ. 5 వేల రూపాయాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జీతం వారికి సకాలంలో అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనకా.. వాననకా.. పనిచేస్తున్న మాకు జీతం కరెక్ట్ టైమ్ కు పడేలా చూడమని ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సీఎం జగన్ సర్కార్.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయినా పర్వాలేదు గానీ.. వాలంటీర్లకు మాత్రం ప్రతి నెలా ఒకటో తారీఖునే జీతాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వ పోర్టల్(apcfss.in)లో మార్పులు చేయాలని తాజాగా ఆదేశించింది. దాంతో వాలంటీర్ల జీతాలకు సంబంధించిన బిల్లులు అప్ లోడ్ చేశాకే.. మిగతా ఉద్యోగుల జీతాలు పొందుపరిచేలా పోర్టల్ లో మార్పులు జరిగిపోయాయి. ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే? వాలంటీర్ల గౌరవ వేతన చెల్లింపులు కొన్ని డిస్ట్రిక్ట్ లల్లో ఆలస్యం అవుతున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందింది. దాంతో సత్వరమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. కొన్ని వేల వాలంటీర్ల కుటుంబాలకు ఆలస్యంగా పడే జీతాల నుంచి ఊరట లభించనుంది.

ఇదికూడా చదవండి: VRO, VRAలకు జగన్ సర్కార్ శుభవార్త! కీలక నిర్ణయం..