iDreamPost
android-app
ios-app

వీడియో: డై హార్ట్ ఫ్యాన్..చేతిపై జగన్ ఫోటో టాటు వేయించుకున్న యువతి!

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక తమ అభిమాన నేతపై ఉన్న ప్రేమను గొప్పగా చాటుకున్నారు. తాజాగా ఓ యువతి సీఎం జగన్ పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంది.

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక తమ అభిమాన నేతపై ఉన్న ప్రేమను గొప్పగా చాటుకున్నారు. తాజాగా ఓ యువతి సీఎం జగన్ పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంది.

వీడియో: డై హార్ట్ ఫ్యాన్..చేతిపై జగన్ ఫోటో టాటు వేయించుకున్న యువతి!

సాధారణంగా అభిమానంకి హద్దులు ఉండవు. సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే.. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. పండగలా జరుపుకుంటారు. కొందరి అభిమానం హద్దులు దాటుతుంది. తమ హీరోకు గుడి కట్టడం, వారి బర్త్ డేలకు అన్నదాన కార్యక్రమాలు, రక్తదానం చేస్తుంటారు. మరికొందరు అయితే ఏకంగా తమ గుండెపై, చేతిపై వారి ఫోటోలను టాటు వేయించుకుంటారు. ఇలాంటి డై హాట్ ఫ్యాన్సు, ఇలాంటి అరుదైన ఘటనలు సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా తక్కువ మంది పొలిటికల్ లీడర్స్ కి ఇలాంటి  డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

సినిమాల్లో ఎందరో సూపర్ స్టార్లు ఉన్నారు. అయితే దేశంలోనే పొలిటికల్ సూపర్ స్టార్ మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇది ఎంతో మంది, రాజకీయనేతలు, విశ్లేషకులు చెప్పే మాట. అలానే సినీ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా.. ఈ పొలిటికల్ సూపర్ స్టార్ కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తమ అభిమాన నాయకుడిని గుండెల్లో పెట్టుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ​ కేవలం సామాన్య ప్రజలే కాదు.. ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ కూడా సీఎం జగన్ కి అభిమానులుగా మారారు. ఆయన రాజకీయం జీవితం చూసిన వారు ఫిదా అయ్యి.. అభిమానులుగా మారారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి..సీఎం జగన్  పేరును చేతిపై టాటు వేయించుకుని తన అభిమానం చాటుకున్నారు. ఇలా కేవలం ఆమె కాకుండా ఎంతో మంది సీఎం జగన్ కి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.  తాజాగా  ఒక యువతి కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంది.

తన ప్రియతమ నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఫోటోను ఆ యువతి తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. చేతిపై టాటు వేయించుకుని తన గుండెల్లో ఉన్న తమ అభిమాన నాయకుడి జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న గౌరవాన్ని,  ప్రేమను  ఎంతో గొప్పగా చాటుకుంది. అంతేకాదు తాను జగనన్న ఫోటో పచ్చబొట్టు వేయించుకున్న వీడియోలను, ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో వైసీపీ అభిమానులతో సహా పలువురు ఆ యువతి అభిమానానికి ఫిదా అవుతున్నారు. అంతేకాక ఇలా లీడర్ పై తన ప్రేమను చాటుకున్న యువతిపై  నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దటీజ్ జగన్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ యువతి టాటు ఫోటోలను మీరు ఓ లుక్కేయండి. మరి.. ఇంతలా ఓ నేతపై అభిమానం చూపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.