వారికి శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. వారి ఆర్థికాభివృద్ధికి చేయుత నిచ్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలానే ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు తరచూ ఏదో ఒక శుభవార్త సీఎం జగన్ చెబుతుంటారు. తాజాగా వృద్ధులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. విజయవాడలో జరిగిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలోఓ కీలక ప్రకటన చేశారు. జనవరి నుంచి పింఛన్ ను పెంచనున్నట్లు ప్రకటించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పింఛన్ దారులు సంతోషం వ్యక్తం చేశారు.

సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. జనవరి 1 నుంచి అవ్వాతాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు పింఛన్లు రూ.3వేలకు పెంచే కార్యక్రమం ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. గతంలో ఎన్నికలకు ముందే రూ.3వేలకూ పెంచుకుంటూ పోతామని చెప్పామని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన అన్నారు. ఈ పెన్షన్‌ పెంపు కార్యక్రమం పదిరోజులు ఉంటుందని.. గ్రామస్థాయిలో సంబరాలు జరుగుతాయిని సీఎం తెలిపారు. అవ్వాతాతల సంతోషంలో అందరూ భాగస్వాములం కావాలి సూచించారు.

ఇక పింఛన్ల పెంపు విషయంపై లబ్ధిదారులకు వివరించాలని ఆయన సూచించారు. జగన్ రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పింఛన్ ఎంత అని అడగాలని తెలిపారు. అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తరువాతపెన్షన్‌ రూ.2,25౦కి పెంచారని, ప్రతి ఏటా పెంచుకుంటూ పోయామని సీఎం తెలిపారు. రూ.3వేలకు పెంచుకుంటూ పోతానన్న మాట నిలబెట్టుకున్నామని అవ్వాతాతల, వింతతువు అక్కచెల్లెమ్మలకు తెలియజేయాలని సీఎం చెప్పారు. 66 లక్షలమందికి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నామని, ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు.. ఇప్పుడు నెలకు రూ.2 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. మరి.. పింఛన్ ను మూడు వేలకు పెంచుతూ తీసుకున్న  జగన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments