iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ!

  • Author singhj Published - 09:48 AM, Tue - 22 August 23
  • Author singhj Published - 09:48 AM, Tue - 22 August 23
విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో వడివడిగా దూసుకెళ్తోంది. ఏపీని అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలపాలనే ధ్యేయంతో సీఎం జగన్ పనిచేస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంపై ఆయన స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్కీమే ‘జగనన్న విద్యా దీవెన పథకం’. ఉన్నత చదువులను అభ్యసించే లక్షలాది మంది స్టూడెంట్స్​కు ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. ప్రతి ఏడాది ఆరంభంలో ఈ మొత్తాన్ని సర్కారు విడుదల చేస్తోంది.

జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇంజినీరింగ్​, మెడిసిన్, డిగ్రీ కోర్సులు అభ్యసించే విద్యార్థులతో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ స్టూడెంట్స్​కు కూడా జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ స్కీమ్ కింద ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ కోర్సులు చదివే స్టూడెంట్స్​కు రూ.20,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, ఐటీఐ స్టూడెంట్స్​కు రూ.10,000 మొత్తాన్ని వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ స్కీమ్ కింద మరోసారి ప్రభుత్వం నిధులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. నిధుల విడుదలకు ఈనెల 28వ తేదీన ముహూర్తం పెట్టింది.

జగనన్న విద్యా దీవెన స్కీమ్ కింద నిధులను రిలీజ్ చేసేందుకు చిత్తూరు జిల్లా నగరికి సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. నగరి సభలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి, విద్యా దీవెన కింద నిధులను తల్లుల అకౌంట్స్​లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చిత్తూరు జిల్లా యంత్రాంగం చేపట్టింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్​కే రోజా సొంత నియోజకవర్గమైన నగరిలో జగన్ బహిరంగ సభను ఏర్పాటు చేయడం, అందులో భాగంగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేయనుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ సభను సక్సెస్ చేసేందుకు మంత్రి రోజా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.