గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజే టీడీపీ నేతల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడింది. స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అంతేకాక స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. తమ నిరసనను తెలియజేశారు. అంతేకాక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇరుపక్షాల మాటల యుద్ధంతో అసెంబ్లీలో ఉద్రికత్త నెలకొంది. అలా తొలిరోజు ఆందోళన మధ్యలోనే పలుమార్లు వాయిదాలు పడుతూ.. సభ జరిగింది. రెండో రోజు కూడా అదే తీరు ఏపీ అసెంబ్లీలో కనిపించింది.
ఐదు రోజుల పాటు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు శుక్రవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మాదిరిగానే రెండో రోజు సభలోకి రావడంతోనే టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రెండో రోజు కూడా ప్రశ్నోత్తరాలను టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుపడ్డారు. అధికార పార్టీ చర్చకు సిద్ధమని చెప్పిన కూడా వినిపించుకోకుండా టీడీపీ సభ్యులు నిరసనలకు దిగారు. అసెంబ్లీలోకి వచ్చి రావడంతోనే స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగ్గారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఇష్టానురీతిగా మాట్లాడటంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరూ ఊరుకోరని టీడీపీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చాడు. సీఎంను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకోమని, నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన తెలిపారు. నిన్న టీడీపీ సభ్యులు రభస సృష్టించడంతో సభలో ప్రత్యేక చర్యలకు స్పీకర్ ఆదేశించారు. ఇలా టీడీపీ ఎమ్మెల్యే ఆందోళన మధ్య అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా పడింది. మరి.. ఏపీ అసెంబ్లీలో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.