iDreamPost
android-app
ios-app

వీడియో: తిరుమల నడక మార్గంలో మరో చిరుత.. పరుగులు తీసిన భక్తులు!

వీడియో: తిరుమల నడక మార్గంలో మరో చిరుత.. పరుగులు తీసిన భక్తులు!

ఇటీవల తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో లక్షిత అనే బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)వెంటనే స్పందించింది. మరణించిన బాలిక కుటుంబానికి పరిహారం అందించింది. దీంతో పాటు నడక దారిలో ఆలయానికి వచ్చే భక్తుల రక్షణ కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలను నడక మార్గం నుంచి అనుమతించమని షరతులు విధించింది.

భక్తుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ తెలిపింది. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా తిరుమల నడక మార్గంలో భక్తులకు మరో చిరుత కనిపించింది. దీన్ని చూసి భక్తులు ఒక్కసారిగా భయంతో వణికిపోయి అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు భక్తులు చిరుత పరిగెడుతుండగా తమ సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే నడక మార్గంలో మరో చిరుత సంచరిస్తుండడం కలవర పెడుతోంది.

ఇది కూడా చదవండి: చిన్నారుల భద్రతపై TTD కీలక నిర్ణయం