Uppula Naresh
Uppula Naresh
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారు. ఇక శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జాల్లా అమలాపురం సీఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా YSR సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని బటన్ నొక్కి సీఎం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) పరిధిలో పనిచేస్తున్న FTE కు కూడా శుభవార్తను అందజేసింది.
విషయం ఏంటంటే? రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) పరిధిలో పనిచేస్తున్న FTEల జీతాలను పెంచుతూ రాష్ట్ర సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీరి వేతనానికి అదనంగా 23 శాతం అదనంగా పెంచినట్లుగా పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ వెల్లడించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 4,569 మంది FTEలు లబ్ది పొందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న FTEలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆస్తి కోసం సొంత మనవడిని చంపిన తాతయ్య..