iDreamPost
android-app
ios-app

విజయవాడ ఘటన మరువకముందే ఏపీకి మరో షాక్.. తుఫాన్ ముప్పు ఉందన్న వాతావరణ శాఖ

  • Published Sep 02, 2024 | 3:46 PM Updated Updated Sep 02, 2024 | 3:46 PM

Andhra Pradesh: ఇప్పుడిప్పుడే వరద ఉధృతి నుంచి ఊపిరి పీల్చుకుంటున్న ఏపీ ప్రజలకు తాజాగా వాతవరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళన ఉన్నారు.

Andhra Pradesh: ఇప్పుడిప్పుడే వరద ఉధృతి నుంచి ఊపిరి పీల్చుకుంటున్న ఏపీ ప్రజలకు తాజాగా వాతవరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళన ఉన్నారు.

  • Published Sep 02, 2024 | 3:46 PMUpdated Sep 02, 2024 | 3:46 PM
విజయవాడ ఘటన మరువకముందే ఏపీకి మరో షాక్.. తుఫాన్ ముప్పు ఉందన్న వాతావరణ శాఖ

గత మూడు రోజులుగా ఏపీలో భీభత్సమైన వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో అయితే ఎన్నడు లేనంత విధంగా కుండపోత వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతల్లోని ప్రజలు ఈ వర్షాల కారణంగా అతలాకుతలమయ్యారు. కనీసం ఇంటి నుంచి బయటకు కాలు పెట్టేలేనంతగా వరుణుడు తన ప్రతపాన్ని చూపించాడు. దీంతో పలు ప్రాంతాల్లోని వాగులు, నదులు, చెరువులు పొంగిపోయి రహదారులు, ఇళ్లులు కొట్టుకుపోయాయి. ఇక ఈ వరదల ధాటికి ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బతికారు. ఇంకొన్ని ప్రాంతాల్లో అయితే వరద ఉధృతికి చాలామంది ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడు వరుణుడు శాంతించడంతో.. ప్రజలకు కాస్త ఊరట లభించింది. దీంతో ఇప్పుడిప్పుడే అందరూ కొలుక్కుంటున్న సమయంలో తాజాగా ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతవరణ శాఖ హెచ్చరింది. దీంతో ఏపీ వాసులు తీవ్ర ఆందోళన ఉన్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పుడిప్పుడే వరద ఉధృతి నుంచి ఊపిరి పీల్చుకుంటున్న ఏపీ ప్రజలకు తాజాగా వాతవరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. ముఖ్యంగా ఈ నెల 6,7వ తేదీల్లో బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. పైగా ఈ అల్పపీడనం తుఫాన్ గా బలపడే ఛాన్స్ ఉందని, పైగా అది ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పై మరీంత క్లారిటీ వస్తుందని ఐఎండీ పేర్కొంది. ఇక ఈ వార్త విన్న ఏపీ ప్రజలు మళ్లీ ప్రమాదకరమైన ముప్పు వస్తుందమో అనే టెన్షన్ ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో విజయవాడ వాసులైతే ఇప్పటికే జరిగిన నష్టం నుంచి కోలుకోక ముందే మరో కొత్త కష్టం రానుందంటూ భయంద్రోళనకు గురవుతున్నారు.

Another typhoon threat for AP

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఏపీలో విజయవాడలో గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు అల్లకల్లోలమయ్యారు. ముఖ్యంగా ఈ వరద ముప్పు ఇప్పటికి తొలగలేదు. చాలా వరకు రహదారులు, రైల్వే ట్రాక్ లన్నీ బాగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావంతో వందలాది రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా జాతీయ రహదారుల మీద ఈ వరద ఎక్కువగా ప్రవహిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలు కూడా అగిపోయాయి. మరోవైపు విజయవాడలో ప్రభుత్వం ఇప్పటికే వరద బాధితుల్ని రక్షించే పనిలో ఉంది. మరీ, ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు ఉందని వాతవరణ శాఖ హెచ్చరించడం పై మీ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.