iDreamPost
android-app
ios-app

AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్. ఇలా చెక్ చేసుకోండి.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్. ఇలా చెక్ చేసుకోండి.

AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సప్లిమెంటరీ ఫలితాలను నేడు అనగా మంగళవారం(జూన్ 18)న విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్ కేటగిరీలో 87 శాతం, ఒకేషనల్ లో 84 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మే 24 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల మొదటి వారంలో ముగిసిన విషయం తెలిసిందే. ఇంటర్ సెకండ్ ఇయర్ సప్పలిమెంటరీ ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,27,190 మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో 74,868 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆన్సర్ స్క్రిప్ట్‌ల రీవెరిఫికేషన్ కోసం జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు రుసుము ఒక్కో సబ్జెక్టుకు రూ.1000గా నిర్ణయించారు. కాగా ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:

  • ఏపీ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ లోకి వెళ్లి హోమ్ పేజీలో ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • సెకండియర్ జనరల్ లేదా వొకేషనల్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
  • విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ రిజల్ట్ కనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి