iDreamPost
android-app
ios-app

ఏపీకి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు! వరుసగా రెండోసారి..

  • Author Soma Sekhar Published - 11:42 AM, Fri - 21 July 23
  • Author Soma Sekhar Published - 11:42 AM, Fri - 21 July 23
ఏపీకి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు! వరుసగా రెండోసారి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్న జగన్ సర్కార్.. తాజాగా మరో అవార్డును అందుకుంది. ఇది రాష్ట్రానికి వరుసగా రెండో అవార్డు కావడం విశేషం. కాగా.. పశువైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచినందుకు గాను ఈ అవార్డు ఏపీకి దక్కింది. ‘ఇండియన్ యానిమల్ హెల్త్ లీడర్ షిప్ అవార్డు-2023’ ఏపీకి లభించింది.

భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో అద్భుతమైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, శాఖలకు అగ్రికల్చర్ టుడే గ్రూప్ రెండో ఎడిషన్ లో జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భాగంగా.. ఏపీకి ఇండియన్ యానిమల్ హెల్త్ లీడర్ షిప్ అవార్డు-2023 దక్కింది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ఈనెల 26న జరగనున్న ఇండియా యానిమల్ హెల్త్ సమ్మిట్-2023 న్యూఢిల్లీలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో ఎన్నడూలేని విధంగా పశు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ.. వస్తోంది. వినూత్న కార్యక్రమాల ద్వారా పాడి రైతులకు రాజన్న పశు వైద్యం పేరిట సేవలు అందిస్తోంది. వీటితో పాటుగా.. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవా రథాలను తీసుకొచ్చింది.

వీటితో పాటుగా.. దేశంలోనే తొలిసారిగా రూ. 7 కోట్లతో టెలిమెడిసిన్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, శాస్త్రవేత్తలు, పశు వైద్యాధికారుల ద్వారా పాడి రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రాష్ట్రంలో పశు వైద్యానికి తీసుకున్న సంస్కరణల ఫలితంగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును దక్కించుకుంది ఏపీ ప్రభుత్వం. కాగా.. సీఎం జగన్ ఆలోచనల కారణంగానే ఈ నాలుగేళ్లలో పశుసంవర్థక శాఖలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు వస్తున్నాయని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ చెప్పుకొచ్చారు. మరి ఏపీ వరుసగా రెండోసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Ap కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త! జగన్ సర్కార్ కీలక నిర్ణయం..