ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే విద్యా రంగంపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మిగతా రంగాలను కూడా అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు చేపడుతూనే ఉంది. అందులో భాగంగానే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల కోరికను త్వరలోనే తీర్చబోతోంది. దాంతో రాష్ట్రంలో 1.67 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కొత్తగా 1.67 లక్షల రేషన్ కార్డులను అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ త్వరలోనే అర్హులకు రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో 1.46 కోట్ల మంది పేద ప్రజలకు నెలనెలా 2.11 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు రూ.846 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం కొత్తగా 1.67 లక్షల రేషన్ కార్డులు ఇస్తాం అనడంతో.. లబ్దిదారుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదికూడా చదవండి: ఇక్కడుంది చంద్రబాబు కాంగ్రెస్.. YSR కాంగ్రెస్ ని జగన్ AP తీసుకెళ్లారు: KTR