విషాదం: అప్పుడే పుట్టిన బిడ్డ మరణవార్త విని ఆగిన తల్లి గుండె

Alluri Sitarama Raju District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పుడే పుట్టిన బిడ్డ మరణవార్త విని ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోవడంతో ఆ తల్లి గుండె ఆగిపోయింది.

Alluri Sitarama Raju District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పుడే పుట్టిన బిడ్డ మరణవార్త విని ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోవడంతో ఆ తల్లి గుండె ఆగిపోయింది.

నవ మాసాలు మోసేది తల్లి. పుట్టిన బిడ్డను తన పొత్తిళ్లలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ చిన్నారి చిరునవ్వుల్లో తన జీవితాన్ని చూసుకుంటుంది. బిడ్డ కడుపున పడ్డ క్షణం నుంచి ఆ చిన్నారిని తన పొత్తిళ్లలోకి తీసుకునే వరకు ఆ తల్లి గుండె అనుక్షణం పరితపిస్తూనే ఉంటుంది. కానీ, ఆ తల్లికి ఆ బిడ్డ దక్కపోతే? అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన చిన్నారి అందకుండా పోతే? అప్పుడే పుట్టిన బిడ్డకు నూరేళ్లు నిండిపోతే? ఆ తల్లి గుండె తట్టుకుంటుందా? కచ్చితంగా తట్టుకోలేదు. అలా తనకు పుట్టిన బిడ్డ పురిటిలోనే ప్రాణం వదిలేసిందని తెలిసుకున్న తల్లి గుండె ఆగిపోయింది. తన బిడ్డతో పాటే తాను కూడా తనువు చాలించింది.

నవమాసాలు మోసిన ఆ తల్లికి ఊహించని కష్టం వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డ తనకు దక్కకుండా పోయింది. ఆ వార్త విన్న ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఈ హృదయవిదారకర ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. బంధువులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం. హుకుంపేట మండలం అడ్డుమండకు చెందిన రమ్యప్రియ(25) సచివాలయ పరిధిలో మహిళా పోలీసుగా చేస్తోంది. ఆమె గోమంగి సచివాలయ పరిధిలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తించేది. నెలలు నిండి పురిటినొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు పాడేరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు నెప్పులు ఎక్కువ కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.

రమ్యప్రియకు సిజేరియన్ చేసి వైద్యులు బిడ్డను బయటకు తీశారు. అయితే అప్పటికే బిడ్డ మృతిచెంది ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సిజేరియన్ తర్వాత రమ్యప్రియ మరొక గదిలో అపస్మారక స్థితిలో ఉంది. కొన్ని గంటల తర్వాత తన బిడ్డ చనిపోయిన విషయం తనకి తెలిసింది. రమ్యప్రియ వెంటనే షాక్ కు గురైంది. తన బిడ్డ ఇక లేదని తెలిసి పెద్దగా కేకలు వేసింది. కేకలు వేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రమ్యప్రియ మృతి చెందింది. ఈ వార్త ప్రస్తుతం మన్యంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పుడే పుట్టిన చనిపోవడం ఒక విషాదం అయితే.. కన్నతల్లి బిడ్డ మరణవార్త చనిపోయిందని తెలుసుకుని అడ్డుమండ గ్రామస్థులు, బంధువులు, కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తల్లీబిడ్డను కోల్పోయిన రమ్యప్రియ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Show comments