iDreamPost
android-app
ios-app

కొడుకు ప్రాణాలు దక్కుతాయని తన కిడ్నీ ఇచ్చింది! కానీ ఆ తల్లి త్యాగం..

  • Published Nov 16, 2024 | 4:42 PM Updated Updated Nov 16, 2024 | 4:42 PM

Peddapalli: నవమాసాలు కనీ పెంచే తల్లి తన పిల్లల్ని ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తన కంట కన్నీళ్లొస్తాయి.

Peddapalli: నవమాసాలు కనీ పెంచే తల్లి తన పిల్లల్ని ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తన కంట కన్నీళ్లొస్తాయి.

కొడుకు ప్రాణాలు దక్కుతాయని తన కిడ్నీ ఇచ్చింది! కానీ ఆ తల్లి త్యాగం..

తల్లి ప్రేమ కంటే గొప్పది ఈ భూమ్మీద ఏదీ లేదు. తల్లి ప్రేమకు కొలమానం అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ.. అతిథిదేవోభవ అని అంటారు. ఎలా చూసుకున్నా అగ్ర తాంబూలం ఎప్పుడూ అమ్మకే ఉంటుంది. నవమాసాలు మోసి కనీ పెంచే అమ్మ తన బిడ్డకు ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా విల విలలాడిపోతుంది. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, ధైర్యం, స్ఫూర్తి వెలకట్టలేనిది. తన పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. తన కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన ప్రయత్నం గురించి తెలిస్తే కఠిన హృదయులైన కన్నీరు పెట్టుకుంటారు.  పూర్తి వివరాల్లోకి వెళితే..

తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్లు ఆ తల్లి త్యాగం ఫలితం లేకుండా పోయింది. అసలు విషయానికి వస్తే.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతుల కుమారుడు రాము(35). కొంత కాలంగా రాము కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తన కొడుకును ఎలాగైనా బాగు చేసుకోవాలని రాము తల్లి ఎన్నో ఆస్పత్రులు తిరిగింది. చెట్టూ, పుట్టా ఇలా కనపడిన దేవతలకు మొక్కుకుంది. ఎలాగైనా తన కొడుకు ప్రాణాలతో బతికి బయటపడాలని తాపత్రయపడంది. తన కొడుకు ప్రాణాలు కాపాడాలని వైద్యులను వేడుకొంది. తన కిడ్నీ ఇస్తే కొడుకు ప్రాణాలతో ఉండే ఛాన్స్ ఉందని ఎవరో సలహా ఇస్తే వెంటనే ఏమీ ఆలోచించకుండా తన కిడ్నీ దానం చేసింది. కానీ.. ఆ తల్లి త్యాగానికి ఫలితం లేకుండా పోయింది. రాము సంవత్సరం పాటు హైదారాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కొడుకును బతికించుకోవాలన్న ఆమె ఆరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఒక కిడ్నీ కోల్పోయినా తనకు బాధలేదు.. కానీ తన కొడుకు బతకలేదన్న బాధ గుండెల్ని పిండేస్తుందని కన్నీరు మున్నీరయ్యింది.

సత్తెమ్మ కిడ్నీ రాముకి అమర్చిన తర్వాత సంవత్సరం పాటు బాగానే ఉన్నాడు. కానీ కొద్ది రోజుల క్రితం ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రాము మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని హైదరాబాద్ నీమ్స్ కి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి శుక్రవారం (నవంబర్ 15) తుది శ్వాస విడిచాడు. సత్తెమ్మ ఇంట వరుస విషాదాలు. నాలుగేళ్ల క్రితమే సత్తెమ్మ భర్త లక్ష్యయ్య చనిపోయాడు. ఇప్పుడు ఒకే ఒక్క కొడుకు మృతి చెందడంతో ఆమె గుండెలవిసేలా రోధించారు. రాముకి భార్య, తొమ్మిదేళ్ల కొడుకు, అయిదేళ్ల కూతురు ఉంది. హ్యాపీగా సాగిపోతున్న వారి కుటుంబంలో కిడ్నీ సంబంధిత వ్యాధి ఛిద్రం చేసింది. కొంత కాలం డయాలసీస్ చేసినా ఫలితం లేకపోయింది. కిడ్ని మార్పిడి చేసుకుంటే ఏమైనా ఫలితం ఉండవొచ్చని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే సత్తెమ్మ తన కిడ్నీ దానం చేసింది. ఆ మహాతల్లి చేసిన త్యాగం వృధా అయ్యింది. రాము కుటుంబ సభ్యులు కన్నీరు చూసి గ్రామస్థులు సైతం కంటతడి పెట్టుకున్నారు.