iDreamPost
android-app
ios-app

పొలంలో కూలీకి దొరికిన విలువైన వజ్రం.. ధర ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో నేలల్లో రత్నాలు పండుతూ ఉంటాయి. ముఖ్యంగా గుంటూరు నుండి అటు కర్నూల్ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంటుంది. అయితే అదృష్టం ఎవరినే ఒక్కరిని వరిస్తూ ఉంటుంది. తాజాగా

తెలుగు రాష్ట్రాల్లో నేలల్లో రత్నాలు పండుతూ ఉంటాయి. ముఖ్యంగా గుంటూరు నుండి అటు కర్నూల్ వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంటుంది. అయితే అదృష్టం ఎవరినే ఒక్కరిని వరిస్తూ ఉంటుంది. తాజాగా

పొలంలో కూలీకి దొరికిన విలువైన వజ్రం.. ధర ఎంతంటే..?

తెలుగు నేలల్లో బంగారు పంటలే కాదూ.. మణులు, మాణిక్యాలు కూడా ఉద్భవిస్తుంటాయి. అత్యంత ఖరీదైన, కాంతివంతమైనది, ప్రపంచంలోనే అతిపెద్దదైన కోహినూర్ డైమండ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో లభించిన సంగతి విదితమే. కాకతీయుల రాజుల కాలం నుండి చేతులు మారుతూ మారుతూ ప్రస్తుతం ఈ డైమండ్ బ్రిటన్‌లో కొలువై ఉంది. పొగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలిసింది. దీన్ని తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ.. తిరిగి ఇచ్చేందుకు అంగీకరించడం లేదు బ్రిటన్. ఏదైమైనప్పటికీ.. ఇప్పటికి తెలుగు నేలపై వజ్రాలు పలు ప్రాంతాల్లో లభిస్తాయని ఉవాచ. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రజలు పనులు మానుకొని మరీ వజ్రాల వేట సాగిస్తుంటారు.

తాజాగా కర్నూలులో ఓ కూలీకి వజ్రం దొరకగా.. దాని విలువ రూ. 10 లక్షలు అని తేలింది. ఈ ఘటన తుగ్గలి మండలం జొన్నగిరిలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొలం పనులు చేస్తుండగా.. దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కర్నూల్ జిల్లాలో మూడు రోజుల పాటు వర్షాలు కురియడంతో మళ్లీ వజ్రాల వేట మొదలైంది. కొంత మంది కూలీలను స్థానిక వ్యాపారులు మాట్లాడుకుని.. వజ్రాల వెతుకులాటకు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో తుగ్గలి మండలంలోని గ్రామాల్లో వజ్రాల వెతుకులాట సాగింది. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి, ఉప్పర్ల పల్లితో సహా మరికొన్ని చోట్ల వజ్రాల కోసం గాలిస్తున్నారు. అలాగే మద్దికెర మండలంలోని బసినేపల్లి,పెరవళి, మదనాంతపురంలో డైమండ్స్ దొరుకుతాయని బలంగా నమ్ముతారు అక్కడి ప్రజలు.

ఈ నేపథ్యంలో మూడు రోజులుగా వర్షాలు కురియడంతో.. మళ్లీ వేట మొదలైంది. ఈ క్రమంలో ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరకగా.. దాన్ని స్థానిక వ్యాపారి అతడికి రూ. 10 లక్షలు చేసే బంగారాన్ని ఇచ్చి ఆ డైమండ్ పట్టుకుపోయారని తెలుస్తోంది. అయితే ఇక్కడ కొన్ని రోజులుగా ఇదే దందా నడుస్తూ ఉంటుంది. కొంత మంది కూలీలను బంగారు, వజ్రాల వ్యాపారులు నియమించుకుని.. వారిని పొలాల్లోకి దింపుతారు. వజ్రం దొరికితే.. దాని రంగు, బరువు, రకాన్నిబట్టి రేటు కట్టి.. వెతికిన వారికి డబ్బులు ఇస్తుంటారు. వీరు మరింత రేటుకు అమ్ముకుంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా కోటి రూపాయలు విలువ చేసే వజ్రాలు లభించిన దాఖలాలున్నాయి.