iDreamPost
android-app
ios-app

రూ. 500లకే కిలో మటన్.. ఎగబడ్డ జనాలు.. ఎక్కడంటే..?

కొంత మంది నాన్ వెజ్ లేనిదో ముద్ద దిగదు. చికెన్, మటన్ వారికొక ఎమోషన్. రోజు పెట్టినా తింటుంటారు. కానీ నిత్యం కొనలేని పరిస్థితి. ఎందుకంటే.. కిలో చికెన్ ధర రూ. 300 వరకు పలుకుతుండగా.. మటన్ ధర వెయ్యి రూపాయల వరకు పలుకుతుంది. ఈ సమయంలో

కొంత మంది నాన్ వెజ్ లేనిదో ముద్ద దిగదు. చికెన్, మటన్ వారికొక ఎమోషన్. రోజు పెట్టినా తింటుంటారు. కానీ నిత్యం కొనలేని పరిస్థితి. ఎందుకంటే.. కిలో చికెన్ ధర రూ. 300 వరకు పలుకుతుండగా.. మటన్ ధర వెయ్యి రూపాయల వరకు పలుకుతుంది. ఈ సమయంలో

రూ. 500లకే కిలో మటన్.. ఎగబడ్డ జనాలు.. ఎక్కడంటే..?

ముక్కలేనిదే ముద్ద నోట్లోకి దిగదు మాంసాహారులకు. నిత్యం వండాలే కానీ తిని పెడుతుంటారు. రోజూ తింటున్నా మొహం మొత్తదు నాన్ వెజ్ ప్రియులకు. చికెన్, మటన్ ఎట్ లీస్ట్ ఎగ్ అయినా ఉండాల్సిందే. సోమవారం, శుక్రవారం, శనివారాలు వంటి వారాలు, వర్జ్యాలతో పని లేదు. ఎప్పుడు తినాలనుకుంటే.. అప్పుడు షాపుకు వెళ్లిన తెచ్చుకుని వండుకుని తినడమో, వండించుకోవడమో చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో చికెన్, మటన్ వంటి ధరలు పెరిగిపోవడంతో కొని కొనలేక, తిని తినలేకపోతున్నారు నాన్ వెజ్ లవర్స్. కిలో చికెన్ రూ. 300లు పలుకుతుంటే.. మటన్ వెయ్యి రూపాయలకు చేరువైంది. అలాంటిది సగం రేటుకు మటన్ ఇస్తున్నామని ప్రకటన చేస్తే ఊరుకుంటారా.. లగెత్తరూ. అదే జరిగింది ఇక్కడ కూడా.

కడప జిల్లాలోని మైదుకూరులో ఇద్దరు వ్యాపారుల మధ్య జరిగిన కాంపిటీషన్.. మాంసాహార ప్రియులకు కలిసొచ్చింది. ఒకరి మీద ఒకరు పంతంతో సుమారు వెయ్యి రూపాయలు పలుకుతున్న వేట మాంసాన్ని రూ. 497కు ఇస్తామని ప్రకటించారు. అంతేనా మటన్ కొన్న వారికి ఫ్రీ గిప్ట్ కూడా ప్రకటించారు. మంచి తరుణం మించిపోతే రాదు అనుకున్న ప్రజలు సైతం భారీ ఎత్తున చేరుకుని కొనుగోలు చేశారు. దీంతో ఆ రెండు షాపులు కస్టమర్లతో కిటకిటలాడాయి. పంతానికి పోయి ఇద్దరు వ్యాపారులు చేసిన పనికి.. మటన్ ప్రియులు లాభపడ్డారు. మైదకూరులో మటన్ షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యాపారులకు మాటామాటా పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి చేరింది. ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాలు వారి కొంపకే ఎసరు తెచ్చాయి.

ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తమ వ్యాపారాన్ని కూల్చుకున్నారు. పందానికి పోయి తమ కంటిని తామే పొడుచుకున్నారు. ఓ షాపు యజమాని రూ. 498 కిలో మటన్ అని ప్రకటించడంతో పాటు గిఫ్ట్ ఫ్రీ అని తెలిపాడు. కిలో మటన్‌తో పాటు రెండు చాక్లెట్లు అందించాడు. నువ్వు రూ. 498 పెడితే.. నేను అంతకన్నా తక్కువకే అమ్ముతానంటూ మరో మటన్ షాపు యజమాని రూ. 497కే కిలో మటన్ ఇవ్వడంతో పాటు మాసాల ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన మైదుకూరే కాదు.. చుట్టు పక్కల ఉన్న ప్రజలు సైతం షాపుకు క్యూ కట్టారు. రూ. 500 లోపే కిలో మటన్ రావడంతో కొంత మంది ఎగబడి మరీ.. కిలోల కొద్దీ మటన్ కొనుగోలు చేశారు. ఇక సాయంత్రానికి ఇద్దరి దగ్గర.. మటన్ అయిపోయింది. ఇద్దరి మటన్ షాపు యజమానుల మధ్య గొడవ.. మాంసాహార ప్రియులకు లాభం చేకూర్చినట్లు అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి