తాడేపల్లిగూడెంలో రూ.2కే చికెన్‌ బిర్యానీ! వేలల్లో ఎగబడ్డ జనం!

Biryani: బిర్యానీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. సండే మండే అని సంబంధం లేకుండా తింటుంటారు బిర్యానీ ప్రియులు. కానీ ఈ టేస్టీ ఫుడ్ ధర చాలా ఎక్కువ. అలాంటిది తక్కువకే అందిస్తున్నామంటే ఆగుతారా..?

Biryani: బిర్యానీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. సండే మండే అని సంబంధం లేకుండా తింటుంటారు బిర్యానీ ప్రియులు. కానీ ఈ టేస్టీ ఫుడ్ ధర చాలా ఎక్కువ. అలాంటిది తక్కువకే అందిస్తున్నామంటే ఆగుతారా..?

బిర్యానీ అంటే చాలా మందికి ఎమోషన్. హైదరాబాద్ నుండి ఖండాంతరాలు దాటింది ఈ మసాలా రైస్. చికెన్, మటన్, ఫ్రాన్స్ దేనితో చేసినా బిర్యాని కనబడగానే ఆవురు ఆవురు అంటూ తినేయాల్సిందే. వండుతుంటే స్మెల్‌కే టెంప్ట్ అయిపోతుంటారు. వారంలో ఒక్కసారైనా బిర్యానీ టచ్ చేయనిదే నిద్ర పట్టదు కొందరికి. వండుకునే ఓపిక లేని వాళ్లకు ఎలాగో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయిగా. ఫోన్ తీసుకుని స్విగ్గీ, జోమాటలో ఆర్డర్ పెట్టుకోవడమే ఆలస్యం. రాగానే వేడి వేడిగా తింటుంటే అబ్బా స్వర్గం అంటే ఇదే కదా అనిపించకమానదు. అయితే ఈ మధ్య కాలంలో చికెన్, మటన్ ధరలు పెరగడంతో బిర్యానీ ధరలు కూడా పెంచేశాయి రెస్టారెంట్స్. అలాంటిది రెండు రూపాయలకే బిర్యానీ అంటే ఆగుతారంటారా..? అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో.

తాడేపల్లి గూడెంలో ఓ హోటల్‌కు తండోప తండాలుగా జనాలు ఎగబడుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడానికి కాసేపు సమయం పట్టింది. అగ్గువకే చికెన్ బిర్యానీ ఆఫర్ పెట్టగానే పెద్ద ఎత్తున స్థానికులు అక్కడకు చేరుకున్నారు. భారీగా క్యూలు కట్టారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బిర్యానీ దక్కినోళ్లు అదృష్టవంతులమని ఫీల్ అయ్యారు. దొరకని వాళ్లు ఉసూరుమంటూ తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంతకు ఈ ఆఫర్ ఎక్కడంటే.. తాడేపల్లి గూడెంలోని ఉషా గ్రాండ్ వద్ద రెస్టారెంట్‌ను కొత్తగా ప్రారంభించారు. స్టార్టింగ్ ఆఫర్ కింద 2 రూపాయలకే బిర్యానీ ఇస్తున్నామని ప్రకటించగానే తినేందుకు పొద్దున్నే బారులు తీరారు. దీంతో అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. లైన్లలో నిల్చున్న వారు సైతం తోసుకోవడంతో కాస్తంత తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు గొడవ పడ్డారు. ఈ విషయం పోలీసుల చెంతకు చేరింది. సీఐ సుబ్రమణ్యం తన ఫోర్స్ తో అక్కడికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు.

అయితే ఇక్కడో ట్విస్ట్ నెలకొంది. ముందుగా వచ్చిన 200 మందికి మాత్రమే 2 రూపాయలకే చికెన్ బిర్యానీ ఇస్తున్నారట. ఈ విషయం తెలియని జనాలు.. తిరునాళ్లకు వెళ్లినట్లు వెళ్లి ఎగబడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో వస్తారని ఊహించలేదు బిర్యానీ సెంటర్ యజమానులు సైతం.  ఇంత మంది ఒకేసారి చేరుకునే సరికి ఖంగుతిన్నారు.  చిన్నపాటి గొడవలు, తగాదాలు జరగడంతో పోలీసుల ఎంట్రీతో అక్కడ పరిస్థితులు సద్దుమణిగాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. మీ దుంపలు తెగ మీరేంట్రా ఇట్లా ఉన్నారు అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు. అదీ మరీ బిర్యానీ అంటే.  అగ్గువకే బిర్యానీ అంటే హైదరాబాదే కాదు.. ఏపీలో కూడా క్రేజేనండోయ్. ఆయ్.

Show comments