iDreamPost

2 రోజుల పాటు స్కూళ్లకు సెలవు.. కార‌ణం ఇదే..!

2 రోజుల పాటు స్కూళ్లకు సెలవు.. కార‌ణం ఇదే..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే ఈ సెలవులు భారీ వర్షాల కారణంగా మాత్రం కాదు.. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ టెట్ పరీక్షలు పరగనున్న నేపథ్యంలో ఆయా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే ఆ పరీక్షా కేంద్రాల్లోని స్కూల్స్ కి సెప్టెంబర్ 14న ఒక్కపూట బడి మాత్రమే ఉంటుందని వెల్లడించింది. దీంతో మొన్నటి వరకు సెలవులపై ఉన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 14,15 టీఎస్ టెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలల్లోని పాఠశాలలకు సెలవు ఇస్తారా లేదా అన్న విషయంపై తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల్లో సెప్టెంబర్ 14 హాఫ్ డే, 15 న పూర్తి సెలవు దినంగా ప్రకటించింది తెలంగాణ విద్యాశాఖ.. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. టెట్ ఎగ్జామ్ సెప్టెంబర్ 15 న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. అయితే ముందు రోజుల ఎగ్జామినేషన్ సెంటర్లో ఇందుకు సంబంధించిన పనులు ఉండటం చేత ముందు రోజు అంటే సెప్టెంబర్ 14వ తేది హాఫ్ డే స్కూల్ ఉంటుంది. కాలేజీలకు కూడా సెలవు అనేదాంట్లో నిజం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

గత ఏడాది టెట్ నిర్వహించిన విద్యాశాఖ.. టీఎస్ టెట్ – 2023 నోటిఫికేషన్ ఆగస్ట్ 1 న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆగస్టు 2 నుంచి 16 తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈసారి హైదరాబాద్ లో 92 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యల్పంగా ములుగు జిల్లా 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరం కూడా టెట్ సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ తెలిపింది. పరీక్షల్లో భాగంగా రెండు పేపర్లు ఉంటాయని తెలిపింది. పరీక్షలకు హాజరయ్యేవారు తప్పని సరి నిబంధనలు పాటించాలని తెలిపింది. హాల్ టికెట్ పై ఉన్న ఫోటో, సంతకం సరిగా లేకున్నా, అభ్యర్థులు ఇటీవల ఫోటో అతికించి గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ సంతకం తీసుకొని, ఆధార కార్డు, ఇతర ఐడీలతో రావాలని సూచించింది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. అందుకే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి