iDreamPost

డ్వాక్రా మహిళలకు 20 వేల కోట్లు.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్!

Dwakra Group loan: తెలంగాణలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు.

Dwakra Group loan: తెలంగాణలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు.

డ్వాక్రా మహిళలకు 20 వేల కోట్లు.. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించాయి. అంతేకాక మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ లో ద్వారా మహిళలు ఆర్థిక సాయం పొందుతుంటారు. ఇక ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ముఖ్యంగా వారికి అందించే రుణం విషయంలో ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ క్రమంలో కొన్ని నిర్ణయాలు మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్వాక్రా మహిళకు గుడ్ న్యూస్ చెప్పింది.  మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు.

తెలంగాణలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను సీతక్క శనివారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు.

ఒకప్పుడు డ్వాక్రా గ్రూప్ వారికి రూ.10 వేల రుణం ఇవ్వాలంటే బ్యాంకులు భయపడేవని ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు రూ. 20 లక్షల వరకు రుణాలు మహిళా సంఘాలకు అందుతుని మంత్రి వెల్లడించారు. ఈ సంఘాలతో మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ఐక్యతను అభివృద్ధిని సాధిస్తున్నమని సీతక్క తెలిపారు. పేదలకు ప్రభుత్వమే అండగా ఉండి అభివృద్ధి పథాన నడిపించాలనేదే తమ సంకల్పమని మంత్రి సీతక్క  స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూప్ లో ఇంకా బల పడాలని మంత్రి సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలకే బ్యాంకర్లు వెళ్లి మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. మహిళల్లో తమ అవసరాలు తీరుస్తారనే విశ్వాసాన్ని బ్యాంకులు కల్పించాలని ఆమె తెలిపారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ తయారీ బాధ్యతను మహిళా సంఘాలకే అప్పగించామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. డ్వాక్రా గ్రూప్ లోని సభ్యులకు జీవిత భీమా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలు కొత్త ఉపాధి అవకాశాలు చెప్పండి, బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదే ఆమె తెలిపారు. మొత్తంగా డ్వాక్రా సంఘాలకు రుణం పెంచుతూ..తెలంగాణ సర్కార్ శుభవార్తను అందించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి