iDreamPost

రేషన్ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

రేషన్ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీలర్ల కమిషన్ పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ వాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు విషయం ఏంటంటే? సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సెక్రటేరియట్ లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ రేషన్ డీలర్ సంఘాల జేఏసీతో సమావేశమయ్యారు. ఇక ఈ సమావేశ అనంతరం సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లకు శుభవార్త చెప్పారు.

ప్రస్తుతం రేషన్ డీలర్లకు ఒక క్వింటాల్ కు రూ. 70 కమిషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ కమిషన్ ఇప్పుడు ఏకంగా డబుల్ చేస్తూ అంటే రూ.140 పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో పాటు కరోనా సమయంలో రేషన్ డీలర్లు ఎంతో కష్టపడి పని చేశారు. ఆ సమయంలో కొంతమంది రేషన్ డీలర్లు కరోనాతో మరణించారు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి హెల్త్ కార్డులు కూడా జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఈ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2025 ఆగస్టు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న CM జగన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి