iDreamPost

పాగల్ మూవీలో విశ్వక్ లవ్ రిజెక్ట్ చేసిన అమ్మాయి.. ఆ నటుడి కూతురా?

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ పాగల్. నరేష్ కుప్పిలి దర్శకుడు. ఇందులో స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించిపోతాడు మన హీరో. అందులో ఓ బొద్దుగా ఉన్న అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆమె రిజక్ట్ చేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ పాగల్. నరేష్ కుప్పిలి దర్శకుడు. ఇందులో స్వచ్ఛమైన ప్రేమ కోసం పరితపించిపోతాడు మన హీరో. అందులో ఓ బొద్దుగా ఉన్న అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆమె రిజక్ట్ చేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

పాగల్ మూవీలో విశ్వక్ లవ్ రిజెక్ట్ చేసిన అమ్మాయి.. ఆ నటుడి కూతురా?

సినిమా మీద ఫ్యాషన్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. పేరు మార్చుకుని సత్తా చాటుతున్న యంగ్ నటుడు విశ్వక్ సేన్. అతడి అసలు పేరు దినేష్ నాయుడు. 2017లో వెళ్లిపోమాకే అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు అనతి కాలంలో స్టార్ హీరోగా ఎదిగాడు. కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. చూసేందుకు యాటిట్యూడ్ పర్సనాలిటీలా కనిపిస్తుంది కానీ.. అభిమానులకు ఎప్పుడు టచ్‌లో ఉండే డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్ నుండి తాజాగా వచ్చిన గామి వరకు డిఫరెంట్ కథలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాడు. ఈ ఏడాది గామితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విశ్వక్. ప్రస్తుతం అతడి చేతిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదవారి, మోకానికల్ రాఖీ వంటి చిత్రాలున్నాయి.

ఇదిలా ఉంటే.. విశ్వక్ సేన్ నటించిన ప్రేమ కథా చిత్రం పాగల్. హిట్ మూవీతో సీరియస్ పాత్రలో మెప్పిస్తే.. ఆ తర్వాత వచ్చిన పాగల్ మూవీలో ప్రేమ్‌గా నటించాడు. తన అమ్మలా ప్రేమ చూపించే అమ్మాయి కోసం పరితపించిపోతుంటాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయికి వెళ్లి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి తనను కాదనుకుంటుంది తొలుత. ఆ తర్వాత తననే అని తెలుసుకుని.. ‘నన్నేనా నిజమేనా’ అని అడుగుతుంది. ఏమన్నావ్ అని అడగ్గా.. ఐలవ్యూ అని ప్రపోజ్ చేస్తాడు మన హీరో ఇదేమన్నా సీక్రెట్టా.. అయితే గట్టిగా చెప్పు అని అంటుంది. ఆ తర్వాత నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని వెళ్లిపోతుంది. బేబి అని పిలుస్తూ ఆమె కోసం కవిత్వాలు కూడా చదువుతుంటాడు. చివరకు రిజక్ట్ చేస్తుంది. ఇంతకు ఆ కామెడీ లవ్ ట్రాకులో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా.. ఇంద్రజ శంకర్.

ప్రముఖ కోలీవుడ్ నటుడు రోబో శంకర్ ముద్దుల తనయే ఈ ఇంద్రజ. ఇందులో కాస్త గ్లామరస్ పాత్రలో మెరిసింది ఇంద్రజ. 2019లో అట్లీ -విజయ్ కాంబోలో వచ్చిన స్పోర్ట్ డ్రామా బిగిల్ (తెలుగులో విజిల్)మూవీలో పోచమ్మ పాత్రలో కనిపించింది ఈ నటినే. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో కాస్త బొద్దుగా కనిపిస్తుంది. ఇదే ఆమెకు పాగల్ మూవీలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. పాగల్ మూవీలో ఆమె సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ‘నీ గుండెల్లో కడతావా గుడి’ అంటూ చెప్పే డైలాగులు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఆ తర్వాత వీరుమణ్ (పసలపూడి వీరబాబు )చిత్రంలో కూడా కనిపించింది. కాగా, ఇటీవల ఇంద్రజ పెళ్లి పీటలు ఎక్కింది. డైరెక్టర్ కార్తీక్‌ను మార్చి 24న వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి