iDreamPost

అంగ‌న్‌వాడీ సిబ్బందికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

Good News for Anganwadi Staff: తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అంగన్ వాడీ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Good News for Anganwadi Staff: తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అంగన్ వాడీ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.

అంగ‌న్‌వాడీ సిబ్బందికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదై మార్క్ చూపిస్తున్నారు. తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాల పై చేశారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ఈ మధ్యనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించారు. ‘ప్రజా పాలన’ అనే కార్యక్రమం ద్వారా ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టారు. రైతు, మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా అంగన్ వాడీ సిబ్బందికి శుభవార్త తెలిపింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

అంగన్ వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసు విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లుగా నిర్ణయిస్తూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత వివరాల ప్రకారం ఏప్రిల్ 30 నాటికి పంపించాలని అధికారులకు ఆదేశాలు పంపించారు. అయితే అంగన్ వాడీ ఉద్యోగులు వారి పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్, టీసీ లేదా మెమె ప్రకారం గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.ఒకవేళ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్య అధికారి జారీ చేసిన బోన్ డెన్సిటో మెట్రీ నివేదిక గాని, వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని వెల్లడించారు. రిటైర్మెంట్ అయిన అంగన్ వాడీ సిబ్బందికి ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.

Good news for Anganwadi staff!

అలాగే అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేసి పదవీ విరమణ పొందే టీచర్ కు లక్ష రూపాయాలు, మినీ అంగన్ వాడీ టీచర్లకు, సహాయకులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్త విన్న అంగన్ వాడీ టీచర్లు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అంగన్ వాడీ సిబ్బంది విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి