iDreamPost

ఈ నగరానికి ఏమైంది హీరోయిన్‌ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తోందంటే?

దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్ తీసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా హిలేరియస్ గా నవ్విస్తుంటాయి. తన సినిమాల్లోని క్యారెక్టర్స్‌ను తమను తాము ఓన్ చేసుకుంటుంటారు యూత్. ఆ మూవీలో ఒకటి ఈ నగరానికి ఏమైంది. ఇందులో నటించిన హీరోయిన్

దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్ తీసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా హిలేరియస్ గా నవ్విస్తుంటాయి. తన సినిమాల్లోని క్యారెక్టర్స్‌ను తమను తాము ఓన్ చేసుకుంటుంటారు యూత్. ఆ మూవీలో ఒకటి ఈ నగరానికి ఏమైంది. ఇందులో నటించిన హీరోయిన్

ఈ నగరానికి ఏమైంది హీరోయిన్‌ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తోందంటే?

తరుణ్ భాస్కర్.. కేవలం దర్శకుడు మాత్రమే కాదు నటుడు, రైటర్, టీవీ ప్రజెంటర్. ఇటీవల కాలంలో యూత్ ఫుల్ అండ్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఆయన సినిమాలోని ప్రతి క్యారెక్టర్.. మన ఇంట్లోనే, పక్కింట్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. హ్యుమర్, నాన్ సింక్‌లో మాట్లాడే క్యారెక్టర్స్‌కు అత్యధిక ప్రాధాన్యతనిస్తాడు. అయితే దర్శకత్వం కన్నా నటన వైపే ఎక్కువ ఆసక్తి చూపడంతో అప్పుడప్పుడు మెగా ఫోన్ పడుతూ అలరిస్తున్నాడు. తొలి సినిమా పెళ్లిచూపులతోనే జాతీయ అవార్డును అందుకున్న తరుణ్.. ఈ నగరానికి ఏమైంది మూవీతో వర్సటైల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అన్న ముద్ర వేసుకున్నాడు. గత ఏడాది కీడా కోలా మూవీని రూపొందించాడు.

తరుణ్ భాస్కర్ చేసినవి కేవలం మూడు సినిమాలే.. ఓ అంధాలజీ మూవీలోని ఓ సెగ్మెంట్ కోసం పని చేశాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన ఏ మూవీకి ఆ మూవీ ఆణిముత్యాలే. కానీ 2018లో వచ్చి యూత్‌ను కట్టిపడేసిన ఈ నగరానికి ఏమైంది. సైలెంట్ హిట్ అందుకుంది. ఇందులో విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను హీరోలుగా నటించగా.. అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లు. కాగా, ఈ ఇద్దరు కూడా అచ్చ తెలుగు హీరోయిన్లు కావడం విశేషం. ఇందులో మన హీరో విశ్వక్ సేన్ ప్రేమించే అమ్మాయి గుర్తుందా.. ఆమెనే సిమ్రాన్ చౌదరి. ఇందులో ఆ అమ్మాయి కనిపించేది కాసేపే కానీ కట్టిపడేస్తుంది. ‘ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకేనా ఒక్కసారి’ సాంగ్‌లో కనిపిస్తుంది. ఆ అమ్మాయితో లవ్ ఫెయిల్యూర్ అయ్యి.. ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంటాడు హీరో.

ఆ మూవీలో అలరించిన సిమ్రాన్ చౌదరి ఇప్పుడు ఎలా ఉందో.. ఏ ప్రాజెక్టులు చేస్తుందంటే..హైదరాబాద్‌కు చెందిన సిమ్రాన్ చౌదరి మోడల్‌గా కెరీర్ స్టార్ చేసింది. 2014లో హమ్ తుమ్ అనే మూవీలో నటించింది సిమ్రాన్. 2017లో మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైందిలో మెరిసింది. బొంభాట్ అనే మూవీలో యాక్ట్ చేయగా.. ఇది అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యింది. మరో తెలుగు నటి చౌందిని చౌదరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. నితిన్ మూవీ చెక్‌లో కనిపించింది. మరోసారి విశ్వక్ సేన్‌తో కలిసి పాగల్ మూవీలో జతకట్టింది. ఇందులో కూడా కాసేపు కనిపిస్తుంది ఈ బ్యూటీ. సెహరీ అనే మూవీలో కూడా యాక్ట్ చేసింది. తాజాగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. రాజాధి రాజా సాంగ్ పాటలో నరేష్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు వెరీ యాక్టివ్. తన ఫోటో షూట్స్, టూర్స్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి