iDreamPost

OYO Rooms: ఆ విషయంలో వెనక్కి తగ్గిన ఓయో.. కారణం ఏంటి..

  • Published May 19, 2024 | 5:38 PMUpdated May 19, 2024 | 5:38 PM

ఓయో రూమ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ విషయంలో వెనక్కి తగ్గింది. ఇంతకు ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.. దీని వల్ల ఎవరికి నష్టం .. ఎవరికి లాభం అంటే..

ఓయో రూమ్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ విషయంలో వెనక్కి తగ్గింది. ఇంతకు ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.. దీని వల్ల ఎవరికి నష్టం .. ఎవరికి లాభం అంటే..

  • Published May 19, 2024 | 5:38 PMUpdated May 19, 2024 | 5:38 PM
OYO Rooms: ఆ విషయంలో వెనక్కి తగ్గిన ఓయో.. కారణం ఏంటి..

ప్రముఖ హోటల్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫాం ఓయో బుకింగ్స్‌ గురించి ఊర్లలో ఉన్నవాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ నగరాల్లో జనాలకు దీని గురించి బాగా తెలుసు. ఈమధ్య కాలంలో చాలా హోటల్స్‌ ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇలా ఉండగా.. తాజాగా ఓయో ఓ నిర్ణయంలో వెనక్కి తగ్గింది. మరి ఎందుకు ఓయో ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. ఇంతకు ఏ విషయంలో ఓయో వెనక్కి తగ్గింది.. దీని వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం వంటి వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి.

ఓయో రూమ్స్‌ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఐపీఓ కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును.. ఓయో తాజాగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. మరి ఓయో ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే.. రీఫైనాన్సింగ్‌ వల్ల అంట. ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా ఓయో రూమ్స్‌ వర్గాలకు సంబంధించిన కీలక అధికారి ఒకరు.. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఐపీఓ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ప్రస్తుతం రీ ఫైనానసింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. దీని వల్ల కంపెనీ ఆర్థిక వివరాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులను అనుసరించి.. నిబంధనల ప్రకారం సెబీకి సమర్పించిన ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ) దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్‌ నిర్ణయం చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు అందిన వివరాలతోనే ఐపీఓకు అప్లై చేసి ఆమోదం కోసం ప్రయత్నించడంలో ఎలాంటి అర్థం లేదు. అందుకే ఐపీఓ నిర్ణయాన్ని తీసుకున్నాం. త్వరలోనే దీనిపై మళ్లీ ప్రకటన చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

ఓయో డాలర్‌ బాండ్ల ద్వారా 450 మిలియన్‌ డాలర్లు సమకూర్చుకునే రీఫైనాన్సింగ్‌ ప్లాన్‌లకు చేరువవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇన్వెస్టర్లు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఐపీఓను రీఫైల్‌ చేయాలని ఓయో రూమ్స్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఇక సరైన స్టాక్‌ను ఎంచుకుని, నిపుణుల సలహాలతో ముందుకు వెళ్లే వారికి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుతాయని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాగే చాలా మంది ఇన్వెస్టర్లు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ల్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు అందుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా ఓయో ఐపీవో కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వారికి ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తుందని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి