iDreamPost

గ్యాంగ్ లీడర్ చిన్నారి గుర్తుందా? అప్పుడే చీర కట్టులో హీరోయిన్‌లా..

నాని డిఫరెంట్ లుక్కులో కనిపించే చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ మూవీకి విక్రమ్ కే కుమార్ దర్శకుడు. ఇందులో కార్తికేయ విలన్. దర్శకుడు సుకుమార్ క్యామియో రోల్ లో కనిపిస్తాడు. ఇందులో ఓ చిన్న పాప ఉంది గుర్తుంది కదా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

నాని డిఫరెంట్ లుక్కులో కనిపించే చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ మూవీకి విక్రమ్ కే కుమార్ దర్శకుడు. ఇందులో కార్తికేయ విలన్. దర్శకుడు సుకుమార్ క్యామియో రోల్ లో కనిపిస్తాడు. ఇందులో ఓ చిన్న పాప ఉంది గుర్తుంది కదా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

గ్యాంగ్ లీడర్ చిన్నారి గుర్తుందా? అప్పుడే చీర కట్టులో హీరోయిన్‌లా..

టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరు విక్రమ్ కె కుమార్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన..సైలంట్ స్క్రీమ్ అనే ఇంగ్లీషు చిత్రంలో దర్శకుడిగా మారాడు. తన తొలి తెలుగు సినిమా ఇష్టంతో మంచి మార్కులు వేయించుకున్నాడు. 13బి, ఇష్క్, మనం, 24, వంటి చిత్రాలకు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించాడు. అలాగే తన గురువు గారు ప్రియదర్శన్ కుమార్తె.. కల్యాణి ప్రియదర్శన్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. గ్యాంగ్ లీడర్, ధాంక్యూ, థూత వెబ్ సిరీస్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ తరం దర్శకుల్లో అక్కినేని నాగేశ్వరరావు, ఆయన వారసులను డైరెక్ట్ చేసిన ఫిల్మ్ మేకర్ ఆయన మాత్రమే. అయితే కంప్లీట్ ఫీమేల్ డామినేట్ మూవీగా నిలిచిపోతుంది గ్యాంగ్ లీడర్.

ఇందులో ఐదు మంది మహిళలకు గ్యాంగ్ లీడర్‌గా ఉంటాడు నాని. ముదసలి నుండి చిన్న పిల్ల వరకు ఆ గ్యాంగులో సభ్యులు. సరస్వతిగా లక్ష్మీ, వరలక్ష్మీగా శరణ్య పొన్వన్నన్, ప్రియాంకగా ప్రియాంక అరుల్ మోహన్, స్వాతిగా శ్రియా రెడ్డి, శ్రీనిధి అలియాస్ చిన్నుగా ప్రణయ్ రాయ్ నటించారు. 2019లో విడుదలైన ఈ మూవీలో నాని చాలా డిఫరెంట్ లుక్కులో కనిపిస్తాడు. పెన్సిల్ పార్థసారథిగా నాని తన నటనతో మెస్మరైజ్ చేస్తాడు. ఇది ఓ రివేంజ్ స్టోరీ. మహిళలంతా బాధితులు కాగా, వారికి సాయ పడుతుంటాడు నాని. కాగా, ఇందులో మరో యంగ్ యాక్టర్ కార్తీకేయ విలన్‌గా నటించిన సంగతి విదితమే. సుకుమార్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడు. ఇక ఇందులో చిన్న పాపగా నటించిన చిన్ను గుర్తింది కదా. తండ్రి కోల్పోయిన ఘటనలో షాక్‌కు గురై మూగగా మారిపోతుంది.

ఇందులో ఈ పాపది చాలా కీలక పాత్ర. ఇప్పుడు ఆ చిన్ను ఇప్పుడు కాస్త పెద్దైంది. ఆరిందల చీర కడుతూ.. నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇంతకు ఆ అమ్బాయి ఎవరంటే ప్రణయ్ పి రాయ్. కేవలం తెలుగు సినిమాలే కాదు.. కన్నడ చిత్రాల్లో కూడా నటిస్తుంది. చూస్తుండగానే హీరోయిన్‌లా మారిపోవడం ఖాయం. జాతి రత్నాలు మూవీలో కూడా నటించింది. ఇటీవల పంచ తంత్రలో కూడా మెరిసింది. ఇవే కాకుండా కన్నడలో ముద్దా ముద్దాగి అనే మూవీతో పాటు నిఖిల్ గౌడ్ హీరోగా వచ్చి రైడర్, వన్స్ ఆపన్ ఎ టైమ్ ఇన్ జమిలి గుడ్డ, అలాగే చార్లీ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన చీర కట్టుతో, డ్యాన్సులతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంకే విషయం ఏంటంటే. ఆమెకు ఓ చెల్లెలు కూడా. ఆ పాప కూడా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి