iDreamPost

నా ఫెయిల్యూర్​కు ధోనీనే కారణం.. కుల్దీప్ షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 16, 2024 | 6:28 PMUpdated Mar 16, 2024 | 6:28 PM

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన ఫెయిల్యూర్​కు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని అన్నాడు.

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన ఫెయిల్యూర్​కు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని అన్నాడు.

  • Published Mar 16, 2024 | 6:28 PMUpdated Mar 16, 2024 | 6:28 PM
నా ఫెయిల్యూర్​కు ధోనీనే కారణం.. కుల్దీప్ షాకింగ్ కామెంట్స్!

టీమిండియా ఏస్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇప్పుడు ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. మధ్యలో కొన్నాళ్లు ఫామ్​లేమితో సతమతమైన ఈ చైనామన్ బౌలర్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు. అతడ్ని ఆపడం బ్యాటర్ల వల్ల కావడం లేదు. గాయం తర్వాత ఎన్​సీఏలో రిహాబిలిటేషన్​లో ఉన్న కుల్దీప్.. అక్కడ తన బౌలింగ్​ను సానబెట్టుకున్నాడు. మరిన్ని వేరియేషన్స్, స్పీడ్ పెంచుకొని రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ నుంచి ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ వరకు కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్​తో భారత జట్టు సాధిస్తున్న​ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నాడు. అయితే కొన్నాళ్లు తాను బ్యాడ్ ఫేజ్ చూశానని.. దీనికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణమని అంటున్నాడు. తన ఫెయిల్యూర్​కు మాహీనే రీజన్ అని చెబుతున్నాడు. కుల్దీప్ ఇలా ఎందుకు అంటున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ధోని భాయ్ ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడాల్సింది. అతడు టీమ్​లో ఉంటే బౌలింగ్ చేయడం చాలా ఈజీ. కానీ ధోని రిటైర్ అయ్యాడు. దీంతో నా పెర్ఫార్మెన్స్ పడిపోయింది. మనల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ముందుకు నడిపించేవారు లేనప్పుడు ఇలాగే జరుగుతుంది. ప్రోత్సహించే వాళ్లు దూరమైనప్పుడు ఒక్కసారిగా బరువు, బాధ్యతలు మన భుజాల మీద పడతాయి. అలాంటప్పుడు కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. నా విషయంలో అదే జరిగింది. ధోని భాయ్ వెళ్లిపోయాక నేను కోలుకొని తిరిగి రాణించడానికి టైమ్ పట్టింది. నా మీద నేనే డిపెండ్ అవ్వాలని క్రమంగా అర్థం చేసుకున్నా’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. తన సక్సెస్​లో ధోని ఎంతో కీలకపాత్ర పోషించాడని.. కానీ అతడు టీమ్​ను వీడటం తనకు ప్రతికూలంగా మారిందన్నాడు. అయితే మొత్తానికి ఇప్పుడు గాడిలో పడ్డానని పేర్కొన్నాడు.

Kuldeep yadav about dhoni

ఇక, ఇంగ్లండ్​తో రీసెంట్​గా జరిగిన టెస్ట్ సిరీస్​లో కుల్దీప్ అద్భుతంగా రాణించాడు. నాలుగు మ్యాచుల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. బజ్​బల్​ క్రికెట్​తో బడాయికి పోయిన ఇంగ్లీష్ బ్యాటర్లను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి స్పిన్ మ్యాజిక్ ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అందుకే కుల్దీప్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంగ్లండ్ లెజెండ్ జెఫ్రీ బాయ్​కాట్ కూడా అతడిపై పొడగ్తల వర్షం కురిపించాడు. ‘కుల్దీప్ బౌలింగ్​ను ఇంగ్లీష్ బ్యాటర్లు అర్థం చేసుకోలేకపోయారు. సిరీస్ ఆఖరి వరకు ఇదే కంటిన్యూ అయింది. మొదట్లో అతడు మిస్టరీగా అనిపించడం వరకు ఓకే. కానీ ఒక ఇంటర్నేషనల్ బౌలర్​ను ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవాలి’ అని బాయ్​కాట్ వ్యాఖ్యానించాడు. మరి.. ధోని వల్లే తాను ఫెయిలయ్యానని కుల్దీప్ అనడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గుజరాత్ టీమ్​లో ఇదీ హార్దిక్ పరిస్థితి.. నెహ్రా కామెంట్​తో అసలు నిజం బయటపడింది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి