iDreamPost
android-app
ios-app

Ambati Rayudu: YCPలో చేరిన అంబటి రాయుడు.. పొలిటికల్ కెరీర్​పై కీలక వ్యాఖ్యలు!

  • Published Dec 28, 2023 | 7:01 PM Updated Updated Dec 28, 2023 | 7:01 PM

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేశారు. తాజాగా వైసీపీలో చేరిన ఆయన.. తన పొలిటికల్ కెరీర్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేశారు. తాజాగా వైసీపీలో చేరిన ఆయన.. తన పొలిటికల్ కెరీర్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Dec 28, 2023 | 7:01 PMUpdated Dec 28, 2023 | 7:01 PM
Ambati Rayudu: YCPలో చేరిన అంబటి రాయుడు.. పొలిటికల్ కెరీర్​పై కీలక వ్యాఖ్యలు!

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు క్రికెట్​కు గుడ్​ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్​లు ఆడుతూ భారత టీమ్​ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్టార్ క్రికెటర్​ ఈ ఏడాది జెంటిల్మన్ గేమ్​కు వీడ్కోలు పలికారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఈ ఏడాది ఐపీఎల్​లో ఆడిన ఫైనల్ మ్యాచే ఆయన కెరీర్​లో చివరిది. ఆ మ్యాచ్​తో క్రికెట్​లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు రాయుడు. ఆ తర్వాత పాలిటిక్స్​లో యాక్టివ్ అయ్యారు. అలాంటి ఈ క్రికెటర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి సమక్షంలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రాయుడు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్​లో రాయుడుకు వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ ప్రోగ్రామ్​లో డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు రాయుడు. పాలిటిక్స్​లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం తనకు సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి జగన్​పై మంచి అభిప్రాయం ఉందని.. కులమతాలకు అతీతంగా ఆయన పాలన చేస్తున్నారని ప్రశంసించారు రాయుడు. అందుకే ఆయనకు సపోర్ట్​గా గతంలో తాను ట్వీట్స్ చేశానని గుర్తుచేశారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నానని, వారి కోసం పని చేస్తానని రాయుడు చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల మీద టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వాళ్లే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

ambati ratudu join in ycr party

రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాయుడు పేర్కొన్నారు. కాగా, గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. విద్యార్థులు, యువతను కలసి మాట్లాడుతున్నారు. ఇక, ఈ సీజన్​ ఐపీఎల్​ రాయుడి కెరీర్​లో ఆఖరిదిగా నిలిచింది. ఐపీఎల్​-2023 ఫైనల్​కు ముందే తన రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశారు రాయుడు. ఆఖరి పోరు తర్వాత క్రికెట్​లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటానని చెప్పారు. చెప్పినట్లే జెంటిల్మన్ గేమ్​కు గుడ్​ బై చెప్పేశారు. అయితే ఫైనల్‌ మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్​ను చెన్నై ఓడించడంతో రాయుడుకు గ్రాండ్​గా గుడ్​బై చెప్పినట్లయింది. ఆయన తన కెరీర్​ను హ్యాపీగా ముగించారు. ఆ తర్వాత మెళ్లిగా పాలిటిక్స్ వైపు అడుగులు వేసిన టీమిండియా మాజీ బ్యాటర్.. తాజాగా వైసీపీలో చేరారు. మరి.. రాయుడు వైసీపీలో చేరడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: RGV Vs Nagababu: నాగబాబుపై ఆర్టీవీ కౌంటర్.. సార్ మీరు నా కన్నా పెద్ద కమెడియన్