iDreamPost
android-app
ios-app

RGV Vs Nagababu: నాగబాబుపై ఆర్టీవీ కౌంటర్.. సార్ మీరు నా కన్నా పెద్ద కమెడియన్

  • Published Dec 28, 2023 | 10:37 AM Updated Updated Dec 28, 2023 | 10:37 AM

ఆర్జీవీ, నాగబాబు మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలయ్యింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. ప్రస్తుతం వారి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..

ఆర్జీవీ, నాగబాబు మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలయ్యింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. ప్రస్తుతం వారి ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..

  • Published Dec 28, 2023 | 10:37 AMUpdated Dec 28, 2023 | 10:37 AM
RGV Vs Nagababu: నాగబాబుపై ఆర్టీవీ కౌంటర్.. సార్ మీరు నా కన్నా పెద్ద కమెడియన్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం సినిమా కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల ఆపడానికి కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ వారి ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. రేపు అనగా డిసెంబర్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే వ్యూహం సినిమా మీద కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. రామ్ గోపాల్ వర్మ ఆఫీసు బయట దాడికి దిగారు. వర్మ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఇలా ఉండగా ఏపీ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్.. ఆర్జీవీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వర్మ తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ చానెల్లో డిబేట్ లో బహిరంగంగా ప్రకటించాడు.

ఈ క్రమంలో ఆర్జీవీ.. కొలికపూడి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజయవాడ డీజీపీ ఆఫీసుకెళ్లి.. కొలికపూడి, సదరు టీవీ చానెల్ యజమాని, యాంకర్ మీద ఫిర్యాదు చేశాడు. తాజాగా వర్మ ఈ ఫిర్యాదు మీద నాగబాబు కౌంటర్లు వేశాడు. కొన్ని రోజుల క్రితం వరకు నాగబాబు, ఆర్జీవీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వైరం ఉండేది. ట్విట్టర్ వేదికగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచేది. అయితే గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న వీరిద్దరూ.. తాజాగా మాటల యుద్ధానికి తెర తీశారు. కొలికపూడి మీద ఆర్జీవీ ఫిర్యాదు చేసిన ఘటనపై స్పందిస్తూ కౌంటర్లు వేశాడు నాగబాబు.

ఈక్రమంలో నాగబాబు ట్విట్టర్ లో.. “ఆర్జీవీ తల నరికి తెచ్చి ఇచ్చిన వారికి కోటి ఇస్తానని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు. తనకు ప్రాణహానీ ఉందని ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వర్మ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. నేను కూడ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను” అన్నాడు.

“ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో.. ఆ మాటకొస్తే ఇండియాలోనే ఏ పనికిమాలిన వెధవ.. మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడిని ఎవడు చం*పడు కదా మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కాపెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు” అంటూ  పోస్ట్ వేశాడు.

దీనిపై స్పందిస్తూ.. వర్మ తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే , నా సినిమాలో మీరు. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ వర్మ ట్వీట్ వేశాడు. వీరిద్దరి ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş