iDreamPost

అందరూ చెప్పిందే మద్దాలి గిరి కూడా చెప్పాడు

అందరూ చెప్పిందే మద్దాలి గిరి కూడా చెప్పాడు

చీమా చీమ నువ్వెందుకు కుట్టావ్?చేపా చేపా నువ్వెందుకు ఎండలేదు?కథలు అందరికి తెలిసినవే!ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తారో అది రాజకీయం వేడి మీద ఉన్నప్పుడు కూడా ప్రజలకు తెలుసు. అయినా ఆ ఎమ్మెల్యేలు యాధావిధిగా అభివృద్ధి పనుల కోసం అంటూ మీడియా ముందు మూసి మూసి నవ్వులతో చెప్తారు. ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి మురళి కూడా అదే కథను చెప్పాడు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలసి ఆయన సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి సారి కలిసినా  సీఎం జగన్‌ను తనను ఆప్యాయంగా పలకరించారని ఆనందం వ్యక్తం చేశారు.

”మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా నేను చెప్పిన సమస్యలు సావధానంగా విన్నారు. గుంటూరు నగర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఎక్కడికి పోయినా నగరంలో మౌలిక సదుపాయాలు, రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాను. రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సీఫ్‌ఎంఎస్‌ నిధులు 25 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని తన సమక్షంలో అధికారులను ఆదేశించార”ని పేర్కొన్నారు. నా జీవితంలో ఇంత వేగంగా ఓ సీఎం స్పందిస్తారని అనుకోలేదన్నారు.

ఇంగ్లీష్‌ మీడియంపై గ్రౌండ్‌ రియాలిటీపై చంద్రబాబుకు తన వైఖరిని చెప్పానని తెలిపారు. ప్రజలు ఇంగ్లీష్‌ మీడియం కావాలని కోరుకుంటున్నారని తెలిపినా నా మాట పట్టించుకోలేదన్నారు. గ్రౌండ్‌ రియాలిటీని పట్టించుకోకుండా వెళుతున్నామని చంద్రబాబుకు పార్టీ సమావేశంలోనే చెప్పానన్నారు. రాజధానిపై మాట్లాడే స్థాయి నాకు లేదన్న గిరి తన పరిధి గుంటూరు నగరం వరకేనన్నారు. రాజధాని సీఎం జగన్‌ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా తనకు చెప్పారన్నారు. గుంటూరు, విజయవాడ నగరాల అభివృద్ధి తన బాధ్యతని సీఎం జగన్‌ తనతో చెప్పారని గిరి పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి