iDreamPost

గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు.. ఈ సీజన్లోనే ఇదే తొలిసారి!

GT vs RCB: గుజరాత్ జట్టు ఈ సీజన్లో అత్యంత దారుణమైన ప్రదర్శనతో అల్లాడుతోంది. ఎక్కడా కూడా మెప్పించే విధంగా ప్రదర్శన చేయలేకపోతోంది. తాజాగా ఆర్సీబీపై ఒక చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.

GT vs RCB: గుజరాత్ జట్టు ఈ సీజన్లో అత్యంత దారుణమైన ప్రదర్శనతో అల్లాడుతోంది. ఎక్కడా కూడా మెప్పించే విధంగా ప్రదర్శన చేయలేకపోతోంది. తాజాగా ఆర్సీబీపై ఒక చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.

గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు.. ఈ సీజన్లోనే ఇదే తొలిసారి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. అయితే టేబుల్ లాస్ట్ లో ఉన్న ఆర్సీబీ మాత్రం ఇప్పుడు జూలు విదిలిస్తోంది. ఆఖరి మ్యాచుల్లో ప్రత్యర్థులను వణికిస్తోంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మంచి ఫామ్ లో కనిపిస్తోంది. తాజాగా గుజరాత్ లో మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లు విజృంభించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టు వరుసగా గుజరాత్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చింది. ఆర్సీబీ పుణ్యమా అని గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లోనే అత్యంత చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.

ఆర్సీబీ, ముంబయి, గుజరాత్ జట్లు టేబుల్ లో ఆఖరి స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఈ జట్లు ఈ సీజన్లో అత్యంత దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకున్నారు. కానీ, ఆఖరి మ్యాచుల్లో ఆర్సీబీ జట్టు విజృంభిస్తోంది. ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్ జట్టును ఆర్సీబీ బౌలర్లు అల్లాడించేశారు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ మొదటి ఓవర్ నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎక్కడా కూడా గుజరాత్ బ్యాటర్లు ఆస్కారం లేకుండా కట్టడి చేశారు. షారుక్ ఖాన్ లాంటి బ్యాటర్ విజృంభించేందుకు ప్రయత్నించినా కూడా కింగ్ కోహ్లీ తన చిరుత వేగంతో రనౌట్ చేసి పెవిలియన్ కు పంపేశాడు. ఎంత కష్టపడినా గుజరాత్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసే ఆస్కారం కనిపించడం లేదు.

ఇవన్నీ పక్కన పెడితే గుజరాత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘోరమైన చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు మరే జట్టు అంత దారుణమైన ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్లోనే గుజరాత్ జట్టు పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోర్ చేసింది. పవర్ ప్లేలో కేవలం 23 పరుగులే చేసి.. 3 వికెట్లు కోల్పోయింది. తర్వాతి స్థానంలో 27/3తో ఆర్సీబీ జట్టే ఉంది. మూడో స్థానంలో 28/4 స్కోర్ తో ముంబయి ఇండియన్స్ ఉండటం విశేషం. గుజరాత్ జట్టుకు ఇదే అత్యల్ప పవర్ ప్లే టోటల్. రన్ కేవలం 7.54 మాత్రమే ఉంది. ఈ రన్ రేట్ ఈ సీజన్లో అన్నీ టీమ్స్ కంటే తక్కువ. ఇలా గుజరాత్ జట్టు ఆర్సీబీతో మ్యాచ్ లో ఒక చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. గుజరాత్ బ్యాటింగ్ చూస్తే.. సాహా(1), గిల్(2), సుదర్శన్(6), షారుక్ ఖాన్(37), మిల్లర్(30), తెవాటియా(35), రషిద్ ఖాన్(18)గా ఉన్నాయి. అందరిలో షారుక్ ఖాన్, మిల్లర్, తెవాటియా మాత్రం పర్వాలేదు అనిపించారు. మొత్తానికి గుజరాత్ మాత్రం ఈ సీజన్లో అత్యంత చెత్త రికార్డును తమ పేరిట నమోదు చేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి