iDreamPost

మీ వల్ల డీమార్ట్‌కి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా? మీరు ఊహించలేరు!

డీమార్ట్ అనేది మనలో చాలా మందికి ఒక ఎమోషన్. ఒక వస్తువు కొనడానికి వెళ్తే.. కనీసం ఓ పది, 15 వస్తువులతో తిరిగి వచ్చేంతగా డీమార్ట్ తో అనుబంధం అలా పెనవేసుకుపోయింది. ఒకసారి లోపలకు వెళ్తే ఓ పట్టాన రాబుద్ధి కాదు. ఉదయం వెళ్లినోళ్లు సాయంత్రం, రాత్రి అయినా అక్కడే ఉంటారు. అట్లుంటది డీమార్ట్ తోటి. మరి ఇంత ఫేమస్ అయిన డీమార్ట్ కి మనం ఎన్ని వందల కోట్ల ఆదాయం ఇచ్చామో తెలుసా?

డీమార్ట్ కి, మిడిల్ క్లాస్ వారికి ఉన్న కనెక్షన్ అందరికీ తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలకు డీమార్ట్ అనేది ఒక ఎమోషన్. చాలా చౌక ధరకే ఇక్కడ నిత్యావసర సరుకులు దొరుకుతాయి. దేశంలో దిగ్గజ రిటైల్ సూపర్ మార్కెట్ చెయిన్ గా ఉన్న డీమార్ట్.. మిడిల్ క్లాస్ పీపుల్ తో నిత్యం రద్దీగానే ఉంటుంది. అవెన్యూ సూపర్ మార్ట్స్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ డీమార్ట్ స్టోర్స్ కి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం ఫలితాలు వెలువడ్డాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను సంస్థ శనివారం విడుదల చేసింది. ఈ సంస్థ నికర లాభం రూ. 563 కోట్లు వచ్చాయని.. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 460 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సంస్థ తెలిపింది.

గతంతో పోలిస్తే ఇప్పుడు 22.4 శాతం పెరిగిందని చెప్పుకొచ్చింది. మరోవైపు కంపెనీ ఆదాయం కూడా 20 శాతం పెరిగిందని.. ఇప్పుడు కంపెనీ ఆదాయం రూ. 12,727 కోట్లకు చేరిందని తెలిపింది. పన్నులు, వడ్డీలు, కంపెనీ లోన్ ఈఎంఐలు వంటివి ఎబిటా కిందకు వస్తాయి. ఈ ఎబిటా 22.3 శాతం పుంజుకుని.. రూ. 943 కోట్లుగా ఉంది. ఇక ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13 బేసిస్ పాయింట్ల వృద్ధితో 7.41 శాతంగా ఉంది. మార్చి త్రైమాసికంలో ఇంతలా లాభాలు రావడానికి కారణం సాధారణ వస్తువులు, దుస్తుల వ్యాపారం పెరగడమే అని కంపెనీ తెలిపింది. రెండేళ్లు లేదా అంతకంటే ముందు స్టార్ట్ అయిన డీమార్ట్ స్టోర్లు గత ఆర్థిక ఏడాదిలో 9.9 శాతం వృద్ధి చూపించాయని సంస్థ తెలిపింది.

రెండేళ్లు, అంతకంటే పాతవి కలిపి మొత్తం 284 డీమార్ట్ స్టోర్లు ఉన్నాయని.. కొత్తగా 41 స్టోర్లు తెరిచామని కంపెనీ సిబ్బంది అన్నారు. మొత్తం స్టోర్లు 365కు చేరాయని అన్నారు. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ డీమార్ట్ స్టోర్లు దేశంలో 23 నగరాల్లో ఉన్నాయని.. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరిస్తామని అన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఎన్సీఆర్, ఛత్తీస్ గఢ్, పంజాబ్ లలో మొత్తం 15.15 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ బిజినెస్ ఏరియా ఉంది. ఇంతటి సక్సెస్ సాధించిన డీమార్ట్ కంపెనీ ఫౌండర్ పేరు రాధాకిషన్ దమానీ. ఈయన 2002లో తొలి స్టోర్ ని ముంబైలో ప్రారంభించారు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో నగరాల్లో, పట్టణాల్లో అతి పెద్ద స్టోర్ చెయిన్ గా రూపాంతరం చెందింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి