iDreamPost

RCB vs GT: స్టేడియంలో అనుష్క శర్మ సందడి.. కోహ్లీ ఫ్యాన్స్​కు ఇది చాలా స్పెషల్!

  • Published May 04, 2024 | 9:44 PMUpdated May 04, 2024 | 9:44 PM

స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మ చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్​కు అటెండ్ అయ్యారు. ఆర్సీబీ-జీటీ మ్యాచ్​ జరుగుతున్న చిన్నస్వామి స్టేడియంలో ఆమె సందడి చేశారు.

స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కోహ్లీ భార్యగానే కాదు.. బాలీవుడ్ హీరోయిన్​గానూ ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. కళ్లతోనే హావభావాలు పలికిస్తూ అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానాన్ని ఆమె చూరగొంది. అయితే పెళ్లి తర్వాత ఆమె సినిమాలు తగ్గించింది. టీమిండియా మ్యాచ్​లు జరిగే స్టేడియాల్లో ఆమె ఎక్కువగా దర్శనమిచ్చేది. కోహ్లీ బ్యాటింగ్ సమయంలో తెగ సందడి చేసేది. కానీ ఈ మధ్య స్టేడియానికి అనుష్క ఎక్కువగా రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ డల్ అయిపోయారు. అయితే మొత్తానికి చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్​కు అటెండ్ అయ్యిందామె.

ఆర్సీబీ-జీటీ మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన చిన్నస్వామి స్టేడియంలో అనుశ్క శర్మ సందడి చేసింది. బెంగళూరు ఫీల్డింగ్​ టైమ్​లో నవ్వుతూ చాలా సంతోషంగా కనిపించింది. కోహ్లీని ఎంకరేజ్ చేసింది. ఆమె నవ్వు మ్యాచ్​కే హైలైట్ అని చెప్పాలి. వరుసగా 6 మ్యాచుల్లో ఓడిన ఆర్సీబీ మళ్లీ విజయాల బాట పట్టింది. గత రెండు మ్యాచుల్లోనూ నెగ్గింది. జీటీతో మ్యాచ్​లోనూ డామినేట్ చేస్తోంది. ఈ టైమ్​లో ఇవాళ కోహ్లీ లేడీ లక్ అనుష్క స్టేడియంలో సందడి చేసింది. ఆమె రాకతో విరాట్ ఫీల్డ్​లో మరింత చెలరేగాడు. బుల్లెట్ త్రోతో ఆకట్టుకున్నాడు. ప్రెగ్నెన్సీ, ఆ మీదట డెలివరీతో కొన్నాళ్లుగా కనిపించని అనుష్క మళ్లీ స్టేడియంలో సందడి చేయడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఆమె నవ్వే అన్నీ చెబుతోందని.. ఆర్సీబీ విజయాలు, కోహ్లీ పెర్ఫార్మెన్స్​ గర్వం ఆమె స్మైల్​లో ఉట్టిపడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి