iDreamPost

Chandrababu: కనిగిరిలో చంద్రబాబు షో అట్టర్ ప్లాప్.. బాబు ప్రసంగిస్తుండగానే కుర్చీలు ఖాళీ

  • Published Jan 06, 2024 | 10:19 AMUpdated Jan 06, 2024 | 10:19 AM

ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఈ సారి జనాలు ఆయన్ను నమ్మడానికి రెడీ లేరు. తాజాగా కనిగిరి షో చూస్తే ఇది అర్థం అవుతుంది. ఆ వివరాలు..

ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఈ సారి జనాలు ఆయన్ను నమ్మడానికి రెడీ లేరు. తాజాగా కనిగిరి షో చూస్తే ఇది అర్థం అవుతుంది. ఆ వివరాలు..

  • Published Jan 06, 2024 | 10:19 AMUpdated Jan 06, 2024 | 10:19 AM
Chandrababu: కనిగిరిలో చంద్రబాబు షో అట్టర్ ప్లాప్.. బాబు ప్రసంగిస్తుండగానే కుర్చీలు ఖాళీ

రానున్న ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం కోసం టీడీపీ, మిత్ర పక్షాలు చేస్తోన్న ప్రయత్నాలు చూస్తున్న జనాలు.. అధికారంలో ఉన్నప్పుడు ఇందులో పదో వంతైనా ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తే బాగుండేది కదా అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు. మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా.. జనాలు మరోసారి చంద్రబాబును నమ్మడానికి రెడీగా ఉన్నారా అంటే లేదు అని ముక్తకంఠంతో చెబుతున్నారు ఏపీ ఓటర్లు. అవినీతి తప్ప మా బాగోగుల గురించి పట్టించుకోని బాబుకు మరో అవకాశం ఇచ్చి.. మా గోతిని మేమే తవ్వుకోలేము.. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను వదులుకోలేము అంటున్నారు.

ఇక ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాడు. కానీ పాపం ఏం లాభం జనాలు చంద్రబాబు సభల వైపు కన్నెత్తి చూడటం లేదు. బలవంతంగా తీసుకువస్తే.. సభ మధ్యలోనే వెళ్లిపోతున్నారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే బాబోయే.. ఇదేం బాదుడు అనుకుని సభ నుంచి బయటకు వెళ్లి పోతున్నారు. దాంతో బాబు సభలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీకి ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఊహించిన రీతిలో సభ సక్సెస్ కాకపోవడంతో టీడీపీ నేతలు షాక్‌ అవుతున్నారు.

chandrababu show flop

శుక్రవారం కనిగిరిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన సమర శంఖారావం బహిరంగ సభ భారీ డిజాస్టర్ అయ్యింది. ఓవైపు చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే జనం అక్కడ నుంచి లేచి బయటకు వెళ్లారు. సభ ప్రాంగణంలో పట్టుమని వంది మంది కూడా కనిపించలేదు. ఇక చేసేదేంలేక.. ఖాళీ కుర్చీలు ఎదురుగా దర్శనమిస్తున్నప్పటికీ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. జనాల నుంచి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి.. బాబు మాత్రం తన పాత స్టైల్‌లోనే వెలిగొండ ప్రాజెక్టుకు తానే శిలా ఫలకం వేశానని, తానే ప్రారంభిస్తానంటూ గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ప్రారంభించారు.

చంద్రబాబు ప్రసంగిస్తుండగానే.. జనాలు మధ్యలోనే సభ నుంచి బయటకు వెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాక వైఎస్సార్, జగన్ చొరవ వల్ల సాకారం అయిన వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ ను కూడా బాబు తన ఖాతాలో వేసుకోవడానికి ట్రై చేయడం చూసిన జనాలు మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాబు నువ్వు ఇక మారవా అని ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి