iDreamPost

2 ఏళ్ల కూతురిని చంపిన కసాయి తల్లి! ఎందుకో తెలుసా?

ఓ కసాయి తల్లి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. తన రెండేళ్ల కూతురిని కిరాతకంగా హత్య చేసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ మహిళ కూతురిని ఎందుకు హత్య చేసిందంటే?

ఓ కసాయి తల్లి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. తన రెండేళ్ల కూతురిని కిరాతకంగా హత్య చేసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ మహిళ కూతురిని ఎందుకు హత్య చేసిందంటే?

2 ఏళ్ల కూతురిని చంపిన కసాయి తల్లి! ఎందుకో తెలుసా?

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే భయమేస్తోంది. ఆస్తి, డబ్బుకు ఆశపడి తోడబుట్టిన వాళ్లను, కన్నవాళ్లను ఇలా ఎవరినీ లెక్క చేయకుండా హత్య చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతటి వారినైన హత్య చేసేందుకు వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ తన రెండేళ్ల కుమార్తెను అతి దారుణంగా హత్య చేసింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ కసాయి తల్లి తన కుమార్తెను ఎందుకు హత్య చేసింది? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని నమక్కల్ జిల్లా తిరుచెంగోడ్ పరిధిలోని కందన్ పాళయం ప్రాంతం. ఇక్కడే శక్తి (27)-అగల్య(19) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఈ దంపతులకు శశిధరన్ (2) అనే కూతురు పుట్టింది. కొంత కాలం పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఈ దంపతుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో వీళ్లిద్దరూ తరుచు గొడవలు పడుతూ ఉండేవారు. ఇక భర్త పోరు పడలేని అగల్య.. తన కూతురిని తీసుకుని గతంలో పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఈ మహిళ తన కుమార్తెతో పాటు అక్కడే ఉంటూ వస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 22వ తేదీన అగల్య తన కూతురికి అన్నం తినిపించింది. ఇక మధ్యాహ్నం అయ్యే లోపు ఆ పాప తీవ్ర అస్వస్థతకు గురైంది. అగల్య వెంటనే ఇరుగు పొరుగు వారిని పిలిచింది. అందరూ కలిసి వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆ పాప అప్పటికే మరణించిందని తెలిపారు. ఆ విషయం తెలుసుకుని అంతా కన్నీరు మున్నీరుగా విలపించారు. కానీ, ఎందుకు ఆ చిన్నారి తల్లిపై అందరికీ అనుమానం కలిగింది. దీంతో పోలీసులకు సమచారం అందించారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు అగల్యను అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందని ప్రశ్నించారు. ఆ వివాహిత ఎంతకు నోరు విప్పలేదు. ఇక పోలీసుల స్టైల్ లో విచారించే సరికి అగల్య.. పెదవి విప్పింది. నేను రోజూ కూలీ పనులకు వెళ్లాలనుకుంటే నా కూతురు అడ్డుపడేదని, దీని కారణంగానే మా అమ్మాయికి అన్నంలో విషం కలిపి తినిపించి హత్య చేశానంటూ తన నేరాన్ని అంగీకరించింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత చిన్న విషయానికి తల్లి కూతురిని చంపిందని తెలుసుకుని స్థానికులు షాక్ కు గురవుతున్నారు. కూలీ పనులకు వెళ్లనివ్వడం లేదని కూతురిని హత్య చేసిన ఈ కసాయి తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి