అంతర్జాతియ సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వేగంగా వ్యాపిస్తున్న తీరు, రోజు రోజుకి మరణాల సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకొని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించింది. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ కలసి పని చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సందేశం పంపించింది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టేడ్రస్ అధోనమ్ మాట్లాడుతూ ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండే […]
దేశంలో అధికారికంగా మొదటి కరోనా వైరస్ కేసు నమోదు అయ్యింది. కేరళకి చెందిన ఒక వైద్య విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ఈ వార్తని కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో వైద్య విద్యనభ్యసిస్తున్న అతడు ఇటీవలే తన స్వస్థలం కేరళ వచ్చినట్టు తెలుస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నఅతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఇటీవలే […]