భక్తుడు కోరుకున్నదే దేవుడు వరమిస్తే కలిగే ఆనందమే వేరు. సరిగ్గా ఇప్పుడు ఏపీలో అధికారపక్షం తీరు అలానే ఉంది. తాము ఆశించినట్టే విపక్షాలు వ్యవహరించడం వైఎస్సార్సీపీలో ఉత్సాహాన్ని పెంచుతోంది. తాజా రాజకీయ పరిణామాలన్నీ తాము కోరుకున్నట్టుగా జరుగుతుండడం ఆ పార్టీలో జోష్ పెంచుతోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు ఎజెండా తామే డిసైడ్ చేయాలని అధికార పార్టీ ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచించింది. ఇప్పుడది ఫలిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ […]
శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరిధి ఏమిటో సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా పేర్కొందని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ రోజు శాసన సభలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు.. ఇటీవల ఏపీ హైకోర్టు మూడు రాజధానుల అంశంపై ఇచ్చిన తీర్పును, చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పలు అంశాల గురించి మాట్లాడారు. గత ప్రభుత్వాల విధానాలను నూతన ప్రభుత్వాలు మార్చకూడదు అంటే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని […]
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని పచ్చదండు మైండ్‌గేమ్‌కు తెరతీసింది. ఇక మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదన్నట్టు, అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి తీరాలన్నట్టు విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. తీర్పురావడం తరువాయి అమరావతి రైతుల సంబరాలు, ఆనందోత్సాహాలు అంటూ హడావిడి చేశారు. మరోపక్క టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమై హైకోర్టు తీర్పును స్వాగతించింది. ఇంకోపక్క రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు షరీఫ్, యనమల, ధూళిపాళ్ల, పత్తిపాటి పుల్లారావు, […]
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై న్యాయస్థానాల్లో వివాదాలు తుది దశకు వచ్చాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అమరావతి జేఏసీ, టీడీపీ సహా పలువురు దాఖలు చేసిన పిటీషన్లపై నేడు (గురువారం) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. పాలనా వికేంద్రీకరణ, సాగు చట్టాల రద్దులను వ్యతిరేకిస్తూ దాఖలైన […]
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల సమానాభివృద్ధికి వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ఏర్పాటు మరింత ఆలస్యం కాబోతోంది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి శాసన పరమైన అన్ని చర్యలను జగన్ సర్కార్ చేపట్టినా.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు, సుప్రింకోర్టులలో దాఖలైన పిటిషన్లను అన్నింటినీ కలిపి రోజు వారీ విచారణ జరపాలని సుప్రిం కోర్టు ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది […]
అధికార వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో మళ్లీ కాక రేగుతోంది. కోర్ట్ విచారణ నిలిచిపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటం వంటి కారణాలతో గత కొంతకాలంగా ఈ విషయంలో స్తబ్దత నెలకొంది. ఎన్నికలు పూర్తి కావడంతో పాటు గత రెండు మూడు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుందన్న సంకేతాలు ఇస్తున్నాయి మే 3 నుంచి […]
కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు నాకు అభ్యంతరం లేదు. హైకోర్టు రాయలసీమలో పెట్టాలని నేనూ చెప్పా. రాయలసీమ అభివృద్ధి చెందాలి. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మేందుకు అనుమతి ఇచ్చినట్లే. విశాఖ ప్రజలు వైసీపీని ఓడించాలి. అమరావతి నా కోసం కాదు మీ కోసం నిర్మించాలని మొదలు పెట్టాను. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అమరావతిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్లే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ గెలిస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అనుమతి ఇచ్చినట్లేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అమ్మేది కేంద్రప్రభుత్వమైతే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడిన చంద్రబాబు.. కార్యనిర్వాహక రాజధాని అంశంపై మాత్రం ఇలాంటి హెచ్చరిక ప్రకటన చేయలేదు. విశాఖలో వైసీపీ గెలిస్తే.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను […]
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణకు ముహూర్తం సమీపిస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంలో కీలక నిర్ణయాలుంటాయనే ప్రచారం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో అమరావతికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే దిశలో సాగుతోంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఏంచేయాలనే దానిపై చర్చ మొదలయ్యింది సీఎస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపింది. ప్రతిపాదనలు […]
మూడు రాజధానుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏపీ వికేంద్రీకరణ బిల్లుకు రాజ్ భవన్ ఆమోదముద్ర వేసినప్పటికీ.. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. కోర్టు కేసుల ఇబ్బందుల రూపంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం వేచి చూస్తోంది. కాగా.. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడానికి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి పరిపాలనను విశాఖపట్నానికి తరలించడానికి గత ఏడాదిలోనే ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా కోర్టు […]