iDreamPost

మరోసారి ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌.. ఇక Airtel, BSNLకు కష్టకాలమే

  • Published May 08, 2024 | 2:33 PMUpdated May 08, 2024 | 2:34 PM

5G Spectrum Auction: టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. మరో మాస్టర్‌ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నాడు ముఖేష్‌ అంబానీ. అది జరిగితే ఎయిర్‌టెల్‌, జియోలకు కష్టకాలమే అంటున్నారు.

5G Spectrum Auction: టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో.. మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. మరో మాస్టర్‌ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నాడు ముఖేష్‌ అంబానీ. అది జరిగితే ఎయిర్‌టెల్‌, జియోలకు కష్టకాలమే అంటున్నారు.

  • Published May 08, 2024 | 2:33 PMUpdated May 08, 2024 | 2:34 PM
మరోసారి ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌.. ఇక Airtel, BSNLకు కష్టకాలమే

ప్రస్తుతం మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా బాగా విస్తరిస్తోన్న వ్యాపారం ఏదైనా ఉందా అంటే.. అది టెలికాం బిజినెస్‌ అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఇంట్లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉండటమే గొప్ప. మరి ఆ తర్వాత కీప్యాడ్‌ మొబైల్స్‌ వచ్చాయి. ఆ తర్వాత నెమ్మదిగా వాటిల్లో ఫీచర్లు పెరుగుతూ.. ఇప్పుడు ఏకంగా ఎంత దూరాన ఉన్నా సరే.. ఒకరిని ఒకరం చూసుకుని మాట్లాడుకునే సాంకేతికతతో వచ్చిన స్మార్ట్‌ ఫోన్స్‌ వచ్చాయి. 2జీ, 3జీ, 4జీలు పోయి.. ఇప్పుడు 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. దాంతో ఇంటర్నెట్‌ సంబంధిత కార్యకలాపాలు అన్ని క్షణాల వ్యవధిలో జరిగిపోతున్నాయి.

ప్రస్తుతం 5జీ టెక్నాలజీ దేశవ్యాప్తంగా పూర్తిగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు. ముఖ్యమైన నగరాలు, చిన్న చిన్న పట్టణాల్లో 5జీ సాంకేతికత అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కేంద్ర టెలికాం విభాగం.. త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్‌ విక్రయం కోసం వేలం నిర్వహించడానికి రెడీగా ఉంది. దీనిలో పాల్గొనబోయే టెలికాం కంపెనీలు ఈ సారి భారీ ఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే గతంలో నిర్వహించిన స్పెక్ట్రమ్‌లో ప్రభుత్వానికి తీవ్ర నిరాశే ఎదురయ్యింది. కానీ ఈసారి సీన్‌ మారనుంది అంటున్నారు.

ఎందుకంటే ఈ సారి కేంద్ర టెలికాం శాఖ నిర్వహించనున్న 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతో పాటు రిలయన్స్‌ జియో కూడా పాల్గొననుంది. ఇప్పటికే ముఖేష్‌ అంబానీ ఎంట్రీతో టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఈ రెండు కంపెనీలకు బ్రేక్‌ పడగా.. ఈసారి మరో మాస్టర్‌ ప్లాన్‌తో వాటికి పూర్తిగా చెక్‌ పెట్టడానికి రెడీ అవుతున్నారు రిలయన్స్‌ జియో అధినేత ముఖేష్‌ అంబానీ.

పైగా ఈ సారి 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు చివరి రోజు వరకు కేవలం మూడు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు.. అనగా భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా మాత్రమే అప్లై చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ సారి వేలానికి దూరంగా ఉంది. వచ్చే నెల అనగా జూన్‌ 6న జరిగే ఈ వేలంలో కేంద్ర ప్రభుత్వం రూ.96,317.65 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే 4జీ వేలం సమయంలో రిలయన్స్‌ జియో ఇంకా ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వలేదు. 2016లో టెలికాం మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో.. వరస ఆఫర్లు, అన్‌లిమిటెడ్‌ డేటా, టాక్‌టైమ్‌ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడమే కాక.. అప్పటి వరకు ఈ రంగంలో టాప్‌లో ఉన్న ఎయిర్‌టెల్‌ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టింది. మొత్తంగా చెప్పాలంటే.. టెలికాం పరిశ్రమను తలకిందులు చేసింది. ఇక ఈ సారి 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో రిలయన్స్‌ జియో కూడా పాల్గొనబోతుండటంతో.. గట్టి పోటీ ఉంటుందని.. ముఖేష్‌ అంబానీ గనుక భారీ ధర చెల్లించడానికి ముందుకు వస్తే.. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ప్రొవైడర్లకు కష్టమే అంటున్నారు టెలికాం రంగ నిపుణులు. ఈ రెండు సంస్థలకు కష్టమే అంటున్నారు.

వాస్తవానికి ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం మే 20న జరగాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇప్పుడు జూన్ 6కి వాయిదా పడింది. 800 ఎంహెచ్‌జడ్‌, 900, 1800, 2100, 2300, 2500, 3300 ఎంహెచ్‌జడ్‌, 26 గిగా హెడ్జ్‌ బ్యాండ్‌లలోని స్పెక్ట్రమ్ ఈ వేలంలో అమ్మకానికి ఉంది ఇదిలా ఉండగానే కేంద్ర 6జీ మీద దృష్టి పెట్టాలని.. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం పరిశోధన అభివృద్ధి సంస్థకు సూచించిన సంగతి తెలిసిందే. 5జీ కన్నా 6జీ టెక్నాలజీ 50 రెట్లు అధిక వేగంతో ఉండనుందని తెలుస్తోంది. 2030 నాటికి ఇది అందుబాటులోకి రానుందని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి