iDreamPost

‘అమ్మ ఒడి’ నిబంధనలు సడలింపు

‘అమ్మ ఒడి’ నిబంధనలు సడలింపు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మ ఒడి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే లక్ష్యంతో పని చేస్తోంది. ఈ మేరకు అమ్మ ఒడి పథకం అర్హతలకు సంబంధించి మొదట విధించిన నిబంధనల్లో పలు మార్పులు చేయాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకునే పిల్లల తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏడాది 15 వేల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తామని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టారు. ఈ మేరకు మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

పథకానికి అర్హత ఉన్నా నిబంధనల కారణంగా చాలా మంది అనర్హలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నిబంధనలను సడలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం వర్తింపజేయనున్నారు.

– 75 శాతం హాజరు తప్పక ఉండాలన్న నిబంధన ను ఈ ఏడాదికి మినహాయింపు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి 75 శాతం హాజరు తప్పని సరి చేయనున్నారు.

– విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటినా పథకం వర్తించదు. అయితే కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండడంతో విద్యుత్‌ బిల్లు ఎక్కువగా వస్తోంది. ఇలాంటి సమస్యలు ఉన్న చోట అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించి వారికి కూడా పథకం వర్తింపజేయున్నారు.

– మీ భూమిలో తప్పలతడక వల్ల ఉన్న దాని కన్నా ఎక్కువ భూమి చూపిస్తోంది. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి కూడా పరిశీలన తర్వాత పథకం వర్తింపజేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి