iDreamPost

అది గుర్తుకు రాలేదా.. ఈ బా__కి – నోరు జారిన సీపీఐ నేత

అది గుర్తుకు రాలేదా.. ఈ బా__కి  –  నోరు జారిన సీపీఐ నేత

ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకునే ప్రభుత్వాలపై సునిశితమైన విమర్శలు, ప్రజా ఆందోళనలు చేసే కమ్యూనిస్టులు దారి తప్పుతున్నట్లు వారి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. సమాజంలో వెనుకబాటుతనంపై ప్రభుత్వాలను నిలదీస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ పంచాలని డిమాండ్‌ చేసే లెనిన్, స్టాలిన్‌ వారసులు తమ పంథాను మార్చుకుంటున్నట్లున్నారు. కార్మికులకు, కర్షకులకు అండగా పోరాటాలు చేసి సామ్యవాద ప్రభుత్వమే తమ లక్ష్యమని చాటి చెప్పే సీపీఐ, సీపీఎం నేతలు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నట్లు వారి చర్యలు తెలుపుతున్నాయి.

పెట్టుబడిదారులకు కొమ్ము కాసే పక్షంలో ప్రభుత్వంపై చేసే ఆరోపణలు, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే క్రమంలో సహనాన్ని కోల్పోతున్నారు. అమరాతిలో జరిగిన అక్రమాలపై గతంలో ఆందోళనలు చేసిన కమ్యూనిస్టులు ప్రస్తుతం తమ పంథాను మార్చుకుని వారి లక్ష్యానికి విరుద్ధంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు టీవీ 5 చానెల్‌లో జరిగిన చర్చలో సీపీఐ నేత తుంగ లక్ష్మి నారాయణ నోరు జారారు.

రాజధాని నిర్మాణం, మౌలిక వసతులు, భవనాల నిర్మాణం కోసం గత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని 49,924 కోట్లు అడిగిందని, అదే మొత్తం ప్రస్తుత ప్రభుత్వం కూడా అడిగిందన్నారు. గతంలో 2500 కోట్ల ఇచ్చారని, మిగతాది ఇవ్వాలని 15 ఆర్థిక సంఘానికి ఇటీవల మెమోరాండం ఇచ్చింది ఎవరు..? జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించిన తుంగ లక్ష్మి నారాయణ ‘‘అప్పుడు అది (మూడు రాజధానులు) గుర్తుకు రాలేదా..? ఈ బాస్డడ్స్‌కి’’ అని అసభ్యపదజాలంతో దూషించారు. లక్ష కోట్లతో రాజధాని అమరావతిని ఎవరు కట్టమన్నారంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

కాగా, సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రభుత్వాన్ని అసభ్య పదజాలంతో దూషించిన సీపీఐ నేత తుంగ లక్ష్మినారాయణపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వైఎస్‌ జగన్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని లక్ష్మి నారాయణపై చూపిస్తున్నారు. ఆయన్ను, అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడుతూ ఫైర్‌ అవుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి