iDreamPost

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులతో సీఎం భేటీ – స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి.. ??

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులతో సీఎం భేటీ – స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి.. ??

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓ వైపు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్న నేపధ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులతో భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వివరాలతో కూడిన నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ఇటీవల ఆదేశించిన మేరకు అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్‌ వివరాలను రేపు హైకోర్టుకు సమర్పించనుండడంతో ఆ వెంటనే ఎన్నికలు ఎప్పుడన్నది ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఖాయమైన పక్షంలో ఈ విషయమై చర్చించేందుకే సీఎం జగన్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో భేటీ అవుతున్నారనే టాక్‌ నడుస్తోంది. అందుకే కేవలం జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో మాత్రమే సీఎం సమావేశం కాబోతున్నారని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు గెలుచుకోగా ఏడు నెలల పాలన తర్వాత ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న దానిపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏడు నెలల పాలనా కాలంలో ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన హామీల అమలుకు సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, చేనేతలు, ఆటో డ్రైవర్లు, జూనియర్‌ లాయర్ల సంక్షేమం కోసం పథకాలు అమలు చేశారు. మద్యపాన నిషేధంపై విజయవంతంగా అడుగులు వేస్తూ మహిళల మోముల్లో ఆనందాలు నింపారు.

పధకాలు, పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నా పార్టీ క్యాడర్‌ పరిస్థితిపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండగా, పంచాయతీ ఎన్నికలు స్వతంత్ర గుర్తులపై జరుగుతాయి. క్యాడర్‌ ముందు ఏ ఎన్నికలకు సిద్ధఃగా ఉంది…? ఏ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి, ప్రభుత్వానికి మంచిదన్న అంశాలు సీఎం జగన్‌ మంత్రులతో చర్చించున్నారని సమాచారం.

ఇప్పటికే పరిషత్, పంచాయతీ ఎన్నిలకు రిజర్వేషన్లు ఖారారు చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు ప్రటించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,148 ఎంపీటీలు, 660 జడ్పీటీసీలు ఉన్నాయి. వీటితోపాటు 13,066 పంచాయతీ సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఒక మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులు రెండూ ఒకే సామాజిక వర్గానికి దక్కాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి