iDreamPost

జగన్‌ మెనూ కార్డ్‌ అదుర్స్‌…!

జగన్‌ మెనూ కార్డ్‌ అదుర్స్‌…!

సోమవారం…అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, స్వీట్‌ చిక్కీ, మంగళవారం…పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం…వెజిటబుల్‌ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్‌ చిక్కీ, గురువారం…కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, శుక్రవారం…అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్‌ చిక్కీ, శనివారం…అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగల్‌…! అబ్బా ఏముందిలే మెనూ…! కాస్త ఆ హోటల్‌ అడ్రస్‌ ఎక్కడో చెప్తారా అని అడిగేరు…! ఇది ఏపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మేనమామ హోదాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందించిన మోనూ కార్డు…! కాబట్టి స్కూల్‌ చదువులు ముగించుకున్న వారికి ఈ మెనూ రుచిచూసే అవకాశం లేనట్లే…!

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చిత్తూరులో అమ్మఒడి పథాకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే..! ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా జగన్‌ మధ్యాహ్న భోజన మెనూకార్డును చదివి వినిపించేటప్పుడు…విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున స్పందనొచ్చింది. థ్యాంక్యూ..సీఎం అంటూ తమ ఆనందాన్ని వెల్లిబుచ్చడంతోపాటు ఫ్లకార్డులు ప్రదర్శించి…సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు.

ఏ తల్లిదండ్రులయినా తమ పిల్లలకు రుచికరమైన ఆహారం అందివ్వాలని తాపత్రయపడుతుంటారు. అది తినూ..ఇది తినూ అంటూ ఆహారంలో ఆప్యాయతను కలిపి పెడుతుంటారు..! అయితే ప్రస్తుతం మధ్యాహ్న భోజనం నడుస్తోన్న తీరు చూస్తుంటే గుండె తరుక్కుపోవడం ఖాయం. దీంతో సీఎం జగన్‌ పిల్లలకు అందించే ఆహారంపై దృష్టిపెట్టారని చెప్పొచ్చు. తద్వారా గత సీఎంలకు నేను భిన్నం అని మరోసారి నిరూపించుకన్నట్లయింది. సీఎం హోదాలో ఉండి….పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై దృష్టిపెట్టడం నిజంగా అభినందనీయం…! దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జగన్‌మోహన్‌రెడ్డిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

అయితే తాజా మెనూ కార్డుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయడం వల్ల ప్రభుత్వానికి అదనంగా దాదాపు 200 కోట్లు ఖర్చ కానుంది. అదే సందర్భంలో ఆయాల జీతాలను రూ.1000 నుంచి రూ.3000కు పెంచడంతో మరో 160 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి