అమరావతి నిర్మాణంలో చంద్రబాబు విఠలాచార్య సినిమాలని గుర్తుకు తెచ్చాడని బీజేపీ నేత సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. చనిపోయిన 20 ఏళ్ల తర్వాత కూడా విఠలాచార్య ఇంకా గుర్తున్నాడంటే ఆయన నిజంగా గ్రేట్. 50 సినిమాలని డైరెక్షన్ చేసిన ఆయన చదివింది మూడో తరగతే. కానీ పల్లె ప్రజలకి ఏం కావాలో బాగా చదువుకున్నాడు. కర్నాటకలోని ఉడిపి సమీపంలోని ఉదయవర గ్రామంలో 1920లో పుట్టాడు. తండ్రి ఆయుర్వేదం డాక్టర్. విఠలాచార్య స్కూల్‌కి వెళ్లకుండా నాటకాలు వేసేవాడు. తండ్రికి […]