ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ శక్తి ఏమిటో దేశానికి తెలుస్తోంది. బియ్యం మూటలు మోసే వాళ్ళు అంటూ హేళనలు, పిల్లను కూడా ఇవ్వరంటూ ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు , టీడీపీ నేతలకు వాలంటీర్ల సత్తా ఏమిటో తెలుస్తోంది. అందుకే తేలుకుట్టిన దొంగల్లా ఉంటున్నారు. తరచూ మీడియా, సోషల్ మీడియాలో కరోనా పై మాట్లాడుతున్న టీడీపీ నేతలు వాలంటీర్ల సేవల పై మాత్రం గతంలో లాగా అవాకులు చవాకులు పేలడంలేదు. తాజాగా వాలంటీర్ల వల్ల […]
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాతీయ మీడియా అభినందిస్తూ అనేక కథనాలు రాశాయి. కానీ కొందరు ఈ విపత్తు సమయంలో కూడా రాజకీయ అజెండాతో పనిచేస్తున్నారు. చల సాని శ్రీనివాస్ “ఆంధ్రాలో తక్కువ కరోనా టెస్ట్ లు జరిగాయి కాబట్టి తక్కువ మందికి జబ్బు ఉన్నట్టు తేలింది” వ్యాఖ్యానించారు .ఈ వాఖ్య కూడా జాగర్తలు చెప్పే ధోరణిలో కాకుండా విమర్శనాత్మకంగా అన్నారు. […]