గత డెబ్భై రోజులుగా స్టార్ట్ కెమెరా యాక్షన్ రెడీ పదాలకు దూరంగా ఉన్న పరిశ్రమ వర్గాల్లో అతి త్వరలో సందడి మొదలుకాబోతోంది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఇండస్ట్రీ పెద్దలు కలుసుకుని ఆ మేరకు కొంత హామీ అయితే తెచ్చుకోగలిగారు. జూన్ నుంచి పరిమిత సంఖ్యలో సభ్యులు ఉండేలా షూటింగులు ప్లాన్ చేసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని చెబుతూ త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు. సినిమాటోగ్రఫీ […]
తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఆగిపోయిన సినిమా షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. మళ్లీ గతంలోలా సినిమా, సీరియల్స్ షూటింగ్లకు దశలవారీ అనుమతులు రానున్నాయి. శుక్రవారం టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, […]
” అబ్బే, నాగార్జున గారికి ఏమైందండి. నిన్నే పెళ్లాడతా లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక ఇప్పుడు భక్తి చిత్రాలు అవసరమంటారా” ” ఇదేమైనా ఎన్టీఆర్ కాలమా లేక అక్కినేని వారసుడికి నాన్న భక్త తుకారాం ఏమైనా గుర్తొచ్చిందా “ ” అంత అందగాడైన నాగ్ తో కమర్షియల్ సినిమా చేయకుండా రాఘవేంద్రరావు గారు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నట్టో. పెళ్లిసందడితో వచ్చిన పేరుని రిస్క్ లో పెడుతున్నారు” ” దొరస్వామిరాజు గారికి ఎంత వెంకన్న […]
మల్టీ స్టారర్ ని డీల్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్క హీరో అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నా వాటిని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు. 1993లో అలాంటిదే జరిగింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున-కృష్ణ కాంబినేషన్ లో మురళీమోహన్ గారు భారీ బడ్జెట్ తో వారసుడు తీశారు. ఇది మలయాళంలో వచ్చిన పరంపర(తెలుగులో అధిపతిగా డబ్ చేశారు), హిందిలో వచ్చిన ఫూల్ ఔర్ కాంటేలకు రీమేక్ గా రూపొందింది. వారసుడులో హీరొయిన్ నగ్మా, […]
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ పెద్దలు హాజరు కాగా రాబోయే రోజుల గురించి చర్చలు జరిగాయి. అక్కినేని నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, త్రివిక్రమ్, కొరటాల శివ, చినబాబు, దిల్ రాజు, సి కళ్యాణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. షూటింగులు ఆగిపోవడం వల్ల 14 వేల కార్మికులు వీధిన పడే పరిస్థితి వచ్చిందనే దాని గురించి చిరంజీవి ప్రస్తావించగా గవర్నమెంట్ తరఫున చెప్పబట్టబోయే […]
దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి ప్రస్థానం గురించి చెప్పాలంటే ఓ వెయ్యి పేజీల పుస్తకం కన్నా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. మాస్ సినిమాను ఓ కొత్త మలుపు తిప్పి హీరోయిజంను ఇంకో లెవల్ కు తీసుకెళ్లిన కమర్షియల్ డైరెక్టర్ గా ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన అడవి రాముడు, ఘరానా మొగుడు, వేటగాడు లాంటివి దానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రంతోనూ రికార్డులు సృష్టించడం ఆయనకే చెల్లింది. ఈయన […]
సినిమా తారలు ఇళ్లకే పరిమితం కావడంతో వాళ్ళ కొత్త సినిమా కబుర్లు లేక అభిమానులకు లాక్ డౌన్ పీరియడ్ యమా డల్ గా సాగుతోంది. ఎప్పుడైతే రియల్ మ్యాన్ ఛాలెంజ్ పేరిట అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా సోషల్ మీడియా వేదికగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టాడో ఇక అప్పటి నుంచి ఒకరి నుంచి ఒకరికి ఇది చెయిన్ లా మారుతూ మంచి వినోదాన్ని పంచుతోంది. ట్విట్టర్ ని ప్లాట్ ఫార్మ్ గా చేసుకుని ఇప్పటిదాకా ఇందులో […]
(ఇప్పుడంటే భారీ సినిమాలుగా బాహుబలి, సాహోల గురించి చెప్పుకుంటున్నాం కాని 90వ దశకంలోనే వీటికి ధీటుగా నిలిచిన ఓ క్రేజీ మూవీ గురించి, అప్పటి హైప్ ని ప్రత్యక్షంగా చూసిన వేరే హీరో అభిమాని మాటల్లో) 1997…… పదో తరగతి పూర్తి చేసుకుని ఏదో పెద్దరికం వచ్చిన ఫీలింగ్ తో ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఇయర్ వెలగబెడుతున్న రోజులు. పెన్సిల్ తో గీసినట్టు వచ్చిన నూనూగు మీసాలకే క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్ రేంజ్ లో బిల్డప్ […]
సాధారణంగా చిన్న పిల్లలతో సినిమాలు చేయడం చాలా రిస్క్. కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకోవడం దర్శకులకు కత్తి మీద సవాల్ గా ఉంటుంది. ఊహ తెలిసిన చిన్నారులతో ఓకే కానీ బుడిబుడి అడుగులు వేస్తూ అమ్మానాన్నలనే ప్రపంచం అనుకునే బుడతలతో వ్యవహారం అంత ఈజీగా ఉండదు. అందుకే ఇలాంటి కథలు రాసుకునేటప్పుడే రచయితలు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు పాపం పసివాడు సినిమాను తీసుకుంటే అందులో చైల్డ్ ఆర్టిస్ట్ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చూపిస్తాడు. కారణం […]