కరోన కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్తో దేశం స్తంభించింది. రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గత నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ ఈ నెల 14వ తేదీ వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత పొడిగిస్తారా..? లేదా..? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయితే పలు రాష్ట్రాలు లాక్డౌన్ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. […]
కరోన వైరస్ మహమ్మరి వేగంగా వ్యాపిస్తోంది. ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకూ 13 కేసులున్న ఏపీలో ప్రస్తుతం ఆ సంఖ్య 180కి చేరుతోంది. నిన్న రాత్రి 10 గంటల వరకూ 164 కేసులు నమోదు కాగా, ఈ రోజు ఉదయం 10 గంటలకు అదనంగా మరో 16 కేసులు నమోదయ్యాయి. 12 గంటల్లో 16 కొత్త కేసులు నమోదవడం కరోన మహమ్మరి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మరో తెలుగు […]