విశాఖపట్నం లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాద ఘటనపై పీపుల్స్ స్టార్ అర్. నారాయణ మూర్తి స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోని విడుదల చేశారు. విశాఖ పట్నంలో జరిగిన ఎల్ జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుండి విష వాయువు లీక్ అయి 11 మంది చనిపోవడం వందలాది మంది హాస్పిటల్ పాలవ్వడం మూగ జీవాలు చనిపొవడం చాలా బాధ కలించే విషయం అని , ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక పక్కన భారత […]
ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మీడియంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన నిర్బంధం చేయడంతో ఈ చర్చ మరింత విస్తృతంగా జరుగుతోంది. పైగా ప్రతిపక్షాలు, తెలుగు భాషాభిమానులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు సైతం కేవలం రాజకీయం కోసమే ఈ అంశంలో తలదూర్చి చర్చను రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళుగా కదలిక లేని తెలుగు భాషాభిమానులు ఇప్పుడే పడక కుర్చీల్లో కదలిక తెచ్చుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నారు. […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహారం కోర్టులో నడుస్తోంది. విచారణ మొదలవ్వలేదు. వాదనలు ఇంకా ప్రారంభం కాలేదు. ఫిర్యాదులు, ప్రతిపిర్యాదులు (petitions & counter petitions) దశలోనే ఉంది. ఈ దశలోనే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు తాను దాఖలు చేసిన పిటిషన్ లో చాలా అభ్యంతరకర అంశాలు లేవనెత్తారు. “ఎన్నికల వాయిదా నిర్ణయం గోప్యమైనదని, సంప్రదింపులు అవసరం లేదని” నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. […]
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నిర్దారణ అయ్యాయి. దాంతో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి మొత్తం 1016 కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. శ్రీకాకుళంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ […]
ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తిస్థాయి అక్షర యుద్ధం జరుగుతోంది. మీడియా మొత్తం ఏకపక్షంగా అధికార పక్షంపై ప్రతిరోజూ, ప్రతినిత్యం యుద్ధం చేస్తోంది. మీడియా ప్రతిపక్ష పార్టీ తరపున యుద్ధం చేస్తోంది. మీడియా ఎందుకు ప్రతిపక్షాన్ని భుజాన వేసుకుని మోస్తోందో లేక అధికార పక్షంపై అక్షర యుద్ధం చేస్తోందో ప్రజలకు తెలుసు. అయినా యుద్ధం జరుగుతోంది. ఈరోజు రాష్ట్రంలో తెలుగు మీడియా ఒక ప్రధాన వార్త ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు పలు దేశాలనుండి […]
ఏప్రిల్ 11వ తేదీ.. సరిగ్గా ఇదే రోజు ఆంధ్ర ప్రదేశ్ ఓట్లతో పోటెత్తింది. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన కాలంలో కరువుతో విసుగెత్తిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ వద్ద ఉన్న వజ్రాయుధాన్ని బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ లో మార్పును కోరుకుంటున్న ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలిచారు. అన్ని జిల్లాల్లో దాదాపు 80శాతం మేర పోలింగ్ నమోదవడం అప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలో 3,93 45,717 […]
.ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో బాబు గారి చేతికి పగ్గాలు ఇస్తే అద్భుతాలు సృష్టించబడతాయి అని టీడీపీ శ్రేణులు పలు సామాజిక మాధ్యమాలలో హోరెత్తిస్తున్న సందర్భంగా బాబు గారి విజనరీ ఎలాంటిదా అని ఒక్కసారి గతంలోకి తొంగిచూస్తే ప్రచారార్భాటం , గ్రాఫిక్స్ మాయాజాలం బాగా కనిపిస్తాయి. . ముఖ్యంగా 16 -07-2018 న టీడీపీ ప్రభుత్వం 1500 రోజులు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన పరికించి చూస్తే ,అమరావతిని […]
కరొనా వైరస్ ప్రమాదకరంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడి దేశ వ్యాప్త లాక్ డౌన్ ని ప్రకటించిన నేపధ్యంలో ఒకవైపు సామాన్యుల నుండి ప్రజా ప్రతినిధులదాకా ఇళ్లకే పరిమితమైయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుడా కరొనా వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ప్రతిగ్రామానికి సర్పంచ్ ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే హీరో కావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం తన వ్యవహారశైలి తో, తన ప్రసంగాలు విమర్శలతో అసెంబ్లీ లో నవ్వులు […]