iDreamPost

రోహిత్​తో పెట్టుకుంటున్న గిల్.. ఇలా చేస్తే ఫ్యూచర్ కష్టమే!

  • Published Jun 16, 2024 | 2:44 PMUpdated Jun 16, 2024 | 2:44 PM

టీ20 వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటిదారి పట్టాడు టీమిండియా ఓపెనర్ శుబ్​మన్ గిల్. గ్రూప్ స్టేజ్​ మ్యాచ్​లు ముగిసిన వెంటనే స్వదేశానికి పయనమయ్యాడీ కుర్ర క్రికెటర్.

టీ20 వరల్డ్ కప్ మధ్యలోనే ఇంటిదారి పట్టాడు టీమిండియా ఓపెనర్ శుబ్​మన్ గిల్. గ్రూప్ స్టేజ్​ మ్యాచ్​లు ముగిసిన వెంటనే స్వదేశానికి పయనమయ్యాడీ కుర్ర క్రికెటర్.

  • Published Jun 16, 2024 | 2:44 PMUpdated Jun 16, 2024 | 2:44 PM
రోహిత్​తో పెట్టుకుంటున్న గిల్.. ఇలా చేస్తే ఫ్యూచర్ కష్టమే!

పొట్టి కప్పులో టీమిండియా దూసుకెళ్తోంది. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గిన రోహిత్ సేన.. సూపర్-8 బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది. నిన్న కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వాన వల్ల రద్దయింది. అయితే ఈ మ్యాచ్​ ఫలితంతో సంబంధం లేకుండా నెక్స్ట్ స్టేజ్​కు క్వాలిఫై అయింది భారత్. ఆఫ్ఘానిస్థాన్​, ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్​ లేదా నెదర్లాండ్స్​లో ఒక టీమ్​తో సూపర్-8లో తలపడనుంది మెన్ ఇన్ బ్లూ. ఇందులో కనీసం రెండు మ్యాచుల్లో నెగ్గి, మెరుగైన నెట్ రన్​రేట్​ను కలిగి ఉంటే నాకౌట్ స్టేజ్​కు అర్హత సాధిస్తుంది. ఇప్పటివరకు అమెరికా పిచ్​లపై ఆడిన భారత్.. ఇక మీదట కరీబీయన్ దీవుల్లో తాడోపేడో తేల్చుకోనుంది. సూపర్-8 కోసం జట్టులోని ఆటగాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ టీమ్​తో ట్రావెల్ అవుతూ వస్తున్న యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ మాత్రం స్వదేశానికి వెళ్లిపోనున్నాడు.

గిల్​తో పాటు యంగ్ పేసర్ ఆవేశ్​ ఖాన్​ను తిరిగి భారత్​కు వెళ్లిపోవాల్సిందిగా టీమ్ మేనేజ్​మెంట్ ఆదేశించింది. కెనడాతో మ్యాచ్ ముగిసిన వెంటనే వీళ్లు స్వదేశానికి పయనమైనట్లు తెలుస్తోంది. అయితే పోతూ పోతూ గిల్ చేసిన ఓ పని ఇప్పుడు వైరల్​గా మారింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మను ఇన్​స్టాగ్రామ్​లో గిల్ అన్​ఫాలో చేశాడు. దీంతో అసలు గిల్​కు ఏమైంది? అతడు హిట్​మ్యాన్​తో ఎందుకు పెట్టుకుంటున్నాడు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్​ మెయిన్ టీమ్​లోకి ఈ యంగ్ ఓపెనర్​ను సెలెక్ట్ చేయలేదు. ట్రావెల్ రిజర్వ్​డ్​లో ఒకడిగా అతడ్ని యూఎస్​కు తీసుకెళ్లారు. ఎవరికైనా గాయమైతే గిల్​ను వాడుకుందామని అనుకున్నారు. కానీ యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ రూపంలో ఓపెనింగ్ స్లాట్​కు ప్రత్యామ్నాయాలు ఉండటంతో గిల్​ను స్వదేశానికి పంపాలని భారత మేనేజ్​మెంట్ డిసైడ్ అయింది.

గిల్​ చేసిన తప్పు వల్లే అతడ్ని టీమ్​లో నుంచి తప్పించి స్వదేశానికి పంపిస్తున్నారనే రూమర్లు వస్తున్నాయి. యూఎస్​కు వచ్చినప్పటి నుంచి జట్టుతో ఉండకుండా, ప్రాక్టీస్ చేయకుండా సొంత వ్యాపారాల మీద అతడు ఫోకస్ చేస్తున్నాడని సమాచారం. భారత్-పాకిస్థాన్ మ్యాచ్​కు రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్ లాంటి ఇతర రిజర్వ్​డ్ ఆటగాళ్లు హాజరైనా.. గిల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందుకే క్రమశిక్షణ చర్యల కింద అతడ్ని ఇంటికి పంపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఇన్​స్టాలో రోహిత్​ను గిల్ అన్​ఫాలో చేయడం ఈ న్యూస్​కు మరింత బలం చేకూర్చినట్లైంది. హిట్​మ్యాన్ చెప్పడం వల్లే శుబ్​మన్​ను తీసేశారా? అందుకే అతడు కెప్టెన్​తో పెట్టుకుంటున్నాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇది చూసిన నెటిజన్స్.. ఎంతో ఫ్యూచర్ ఉన్న గిల్ ఇలాంటి పనులతో సాధించేది ఏదీ లేదని కామెంట్స్ చేస్తున్నారు. అన్నీ మరిచి భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. మరి.. రోహిత్​ను గిల్ అన్​ఫాలో అవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by SportsTiger (@sportstiger_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి