iDreamPost
android-app
ios-app

10 ఏళ్లలో ఎన్నో కష్టాలు చూశా.. వాళ్ల స్ఫూర్తితో ఆడుతున్నా: సంజూ శాంసన్

  • Published Jun 03, 2024 | 9:57 PMUpdated Jun 03, 2024 | 9:57 PM

టీ20 వరల్డ్ కప్-2024లో ఫస్ట్ మ్యాచ్​ ఆడేందుకు రెడీ అవుతోంది టీమిండియా. తొలి మ్యాచ్ నుంచే అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తూ పోవాలని ఫిక్స్ అయింది. ఈ మ్యాచ్​లో జట్టు కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీపర్​గా పంత్, సంజూల్లో ఎవరు తుదిజట్టులో ఉంటారనేది ఉత్కంఠను కలిగిస్తోంది.

టీ20 వరల్డ్ కప్-2024లో ఫస్ట్ మ్యాచ్​ ఆడేందుకు రెడీ అవుతోంది టీమిండియా. తొలి మ్యాచ్ నుంచే అపోజిషన్ టీమ్స్​ను వణికిస్తూ పోవాలని ఫిక్స్ అయింది. ఈ మ్యాచ్​లో జట్టు కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీపర్​గా పంత్, సంజూల్లో ఎవరు తుదిజట్టులో ఉంటారనేది ఉత్కంఠను కలిగిస్తోంది.

  • Published Jun 03, 2024 | 9:57 PMUpdated Jun 03, 2024 | 9:57 PM
10 ఏళ్లలో ఎన్నో కష్టాలు చూశా.. వాళ్ల స్ఫూర్తితో ఆడుతున్నా: సంజూ శాంసన్

సంజూ శాంసన్.. దాదాపు దశాబ్దం కాలం కిందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు భారత జట్టులో స్టార్​ ప్లేయర్​గా ఉండేవాడు. వరల్డ్ క్రికెట్​లో తన హవా చలాయించేవాడు. కానీ అలా జరగలేదు. ఎంతో ప్రతిభ కలిగిన బ్యాటర్​గా, వికెట్ కీపర్​గా పేరు తెచ్చుకున్న శాంసన్​కు అదృష్టం కలసిరాలేదు. అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. వచ్చిన అరకొర ఛాన్సుల్ని అతడు సరిగ్గా వినియోగించుకోలేదు. దీంతో అప్పుడప్పుడు టీమ్​లోకి వస్తూ పోతూ ఉన్నాడు, గానీ సెటిల్ కాలేదు. అయితే కెరీర్​పై మరింత ఫోకస్ పెట్టిన శాంసన్ డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొట్టాడు. ఐపీఎల్​-2024లోనూ 531 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ టీమ్​లో చోటు దక్కించుకున్నాడు.

వరల్డ్ కప్​ టీమ్​లో సంజూకు చోటు దక్కడం కష్టమేనని అంతా అనుకున్నారు. అయితే ఐపీఎల్ పెర్ఫార్మెన్స్​ వల్ల సీనియర్ కేఎల్ రాహుల్​ను కాదని అతడ్ని టీమ్​లోకి తీసుకున్నారు. మెగా టోర్నీ కోసం మరింత కసిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు శాంసన్. వరల్డ్ కప్​లో అదరగొట్టి టీమిండియాను విజేతగా నిలపాలని చూస్తున్నాడు. తాజాగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టు తరఫున డెబ్యూ తర్వాత ఇప్పటిదాకా 10 ఏళ్లలో ఎన్నో కష్టాలు చూశానన్నాడు. చాలా వైఫల్యాలు చూశానని, కొన్ని సక్సెస్​లు మాత్రమే దక్కాయని తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకొని ఆడుతున్నానని శాంసన్ పేర్కొన్నాడు.

‘ఈ పదేళ్లలో ఎన్నో కష్టాలు చూశా. నా బెస్ట్ వెర్షన్ ఇదే. ఎంతో అనుభవం సంపాదించాక, ఫుల్ ప్రిపరేషన్​ తర్వాత వరల్డ్ కప్​ బరిలో దిగనుండటం ఆనందంగా ఉంది. ఇంత పెద్ద టోర్నీలో ఆడటానికి కావాల్సిన ప్రతి విషయాన్ని నా జీవితం, క్రికెట్ నాకు నేర్పాయి. డెబ్యూ తర్వాత ఈ 10 సంవత్సరాల్లో చాలా ఫెయిల్యూర్స్, కొన్ని సక్సెస్​లు చూశా. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చూసి నేను స్ఫూర్తి పొందుతా. నాకే కాదు.. మొత్తం భారత జట్టుకు వాళ్లిద్దరే ఇన్​స్పిరేషన్. ఐపీఎల్​ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. కెప్టెన్​గా నా మైండ్ ఎప్పుడూ రకరకాల విషయాలతో నిండిపోయేది. కానీ వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ ఉందనే విషయం గుర్తుకొచ్చేది. మెగా టోర్నీలో ఆడే ఛాన్స్ రావడం చాలా పెద్ద విషయం. వరల్డ్ కప్​లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాను’ అని శాంసన్ చెప్పుకొచ్చాడు. ఇక, ప్రపంచ కప్ స్క్వాడ్​లో సంజూతో పాటు మరో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరిలో ఎవరికి ప్లేయింగ్ ఎలెవన్​లో ఛాన్స్ వస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి