Nidhan
టీ20 వరల్డ్ కప్-2024లో ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతోంది టీమిండియా. తొలి మ్యాచ్ నుంచే అపోజిషన్ టీమ్స్‌ను వణికిస్తూ పోవాలని ఫిక్స్ అయింది. ఈ మ్యాచ్‌లో జట్టు కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీపర్‌గా పంత్, సంజూల్లో ఎవరు తుదిజట్టులో ఉంటారనేది ఉత్కంఠను కలిగిస్తోంది.
టీ20 వరల్డ్ కప్-2024లో ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతోంది టీమిండియా. తొలి మ్యాచ్ నుంచే అపోజిషన్ టీమ్స్‌ను వణికిస్తూ పోవాలని ఫిక్స్ అయింది. ఈ మ్యాచ్‌లో జట్టు కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కీపర్‌గా పంత్, సంజూల్లో ఎవరు తుదిజట్టులో ఉంటారనేది ఉత్కంఠను కలిగిస్తోంది.
Nidhan
సంజూ శాంసన్.. దాదాపు దశాబ్దం కాలం కిందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు భారత జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఉండేవాడు. వరల్డ్ క్రికెట్లో తన హవా చలాయించేవాడు. కానీ అలా జరగలేదు. ఎంతో ప్రతిభ కలిగిన బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా పేరు తెచ్చుకున్న శాంసన్‌కు అదృష్టం కలసిరాలేదు. అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. వచ్చిన అరకొర ఛాన్సుల్ని అతడు సరిగ్గా వినియోగించుకోలేదు. దీంతో అప్పుడప్పుడు టీమ్‌లోకి వస్తూ పోతూ ఉన్నాడు, గానీ సెటిల్ కాలేదు. అయితే కెరీర్‌పై మరింత ఫోకస్ పెట్టిన శాంసన్ డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. ఐపీఎల్-2024లోనూ 531 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
వరల్డ్ కప్ టీమ్‌లో సంజూకు చోటు దక్కడం కష్టమేనని అంతా అనుకున్నారు. అయితే ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ వల్ల సీనియర్ కేఎల్ రాహుల్‌ను కాదని అతడ్ని టీమ్‌లోకి తీసుకున్నారు. మెగా టోర్నీ కోసం మరింత కసిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు శాంసన్. వరల్డ్ కప్‌లో అదరగొట్టి టీమిండియాను విజేతగా నిలపాలని చూస్తున్నాడు. తాజాగా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టు తరఫున డెబ్యూ తర్వాత ఇప్పటిదాకా 10 ఏళ్లలో ఎన్నో కష్టాలు చూశానన్నాడు. చాలా వైఫల్యాలు చూశానని, కొన్ని సక్సెస్‌లు మాత్రమే దక్కాయని తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకొని ఆడుతున్నానని శాంసన్ పేర్కొన్నాడు.
‘ఈ పదేళ్లలో ఎన్నో కష్టాలు చూశా. నా బెస్ట్ వెర్షన్ ఇదే. ఎంతో అనుభవం సంపాదించాక, ఫుల్ ప్రిపరేషన్ తర్వాత వరల్డ్ కప్ బరిలో దిగనుండటం ఆనందంగా ఉంది. ఇంత పెద్ద టోర్నీలో ఆడటానికి కావాల్సిన ప్రతి విషయాన్ని నా జీవితం, క్రికెట్ నాకు నేర్పాయి. డెబ్యూ తర్వాత ఈ 10 సంవత్సరాల్లో చాలా ఫెయిల్యూర్స్, కొన్ని సక్సెస్‌లు చూశా. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చూసి నేను స్ఫూర్తి పొందుతా. నాకే కాదు.. మొత్తం భారత జట్టుకు వాళ్లిద్దరే ఇన్స్పిరేషన్. ఐపీఎల్ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. కెప్టెన్‌గా నా మైండ్ ఎప్పుడూ రకరకాల విషయాలతో నిండిపోయేది. కానీ వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ ఉందనే విషయం గుర్తుకొచ్చేది. మెగా టోర్నీలో ఆడే ఛాన్స్ రావడం చాలా పెద్ద విషయం. వరల్డ్ కప్‌లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాను’ అని శాంసన్ చెప్పుకొచ్చాడు. ఇక, ప్రపంచ కప్ స్క్వాడ్‌లో సంజూతో పాటు మరో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరిలో ఎవరికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ వస్తుందో చూడాలి.
Sanju Samson said “This is the most experienced or prepared Sanju Samson that can come into the World Cup – in the last 10 years, lots and lots of failures with few successes – cricket has taught me a lot”. [BCCI] pic.twitter.com/uHdegYldKS
— Johns. (@CricCrazyJohns) June 3, 2024